చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు మత్స్యకారుల పాలాభిషేకం
విశాఖపట్నం, ఏప్రిల్ 27: రాష్ట్ర మత్స్యకార కులాల సంక్షేమానికి కృషి చేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా, మత్స్యకార నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. శనివారం సాయంత్రం విశాఖపట్నం పౌరగ్రంథాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమం మత్స్యకార నేతల ఉత్సాహం నిలిచింది. జి.ఓ. నెం.217 రద్దు, జీవన భృతి రూ.20,000 పెంపు, ఆయిల్ సబ్సిడీ, వేట పరికరాల పంపిణీ వంటి పథకాల అమలుకు కృతజ్ఞతలు తెలుపుతూ మత్స్యకారులు కూటమి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. రాబోయే రోజుల్లో మత్స్యకార కులాల అభివృద్ధికి మద్దతు కొనసాగించాలని నేతలు కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు నడకుదిటి అర్జున్, ప్రధాన కార్యదర్శి చింతకాయల ముత్యాలు, చైర్మన్ చిలకలపూడి పాపారావు, పీజీ అప్పారావు, తెప్పల శాంతారామ్, కాటా గోపి, తుమ్మల రమేష్, మాతా గురునాథరావు, పుట్టా శివ, సాయి బలరాం, జీవి రమణారావు, అంగ కృష్ణ, పలపల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?