*ముస్లిం బాలుడి ఫీజుకోసం వాసుపల్లి రూ. 5000 సాయం* * *వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో 1,70,467 మందికి అJమ్మవడి వచ్చింది*. * *తల్లికి వందనం లక్షకు పైగా అనర్హులు చేశారు*! * *మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్*

*ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద రూ. 15000 ఇస్తామని కూటమి నేతల హామీ ఇచ్చి లక్షమంది పైగా అనర్హులు చేసి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ విమర్శించారు. ఆసీలమెట్ట కార్యాలయంలో 39 వ వార్డు పోస్ట్ ఆఫీస్ ప్రాంతానికి చెందిన రెహానా భాష (12) స్కూల్ ఫీజుకి వాసుపల్లి గణేష్ కుమార్ 5000 ఆర్థిక సాయం చేశారు*. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి ఏడాది తర్వాత తల్లికి వందనం పథకం హడావిడిగా ప్రారంభించి లబ్ధిదారుల సంఖ్యలో భారీ కోత విధించారన్నారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో 1,70,467 మందికి అమ్మవడి వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో మూడు లక్షల నుండి మూడున్నర లక్షలు మంది విద్యార్థులు లబ్ధి చేరుతుందని భావించారు. కానీ 12000 జీతాలు దాటిన వారికి, 300 యూనిట్లు కరెంట్ బిల్లులు, ఆస్తులు లేని వారికి ఆస్తులు ఉన్నట్లుగా చూపించే అర్హులైనవారిని లక్ష మంది పైగా విద్యార్థులకు తల్లికి వందనంలో కోత విధించారన్నారు. పేదల గుండెచప్పుడు తెలిసిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు నేరుగా ప్రజల ఖాతాల్లో అర్హులందరికీ చేర్చిన ఘనత వైయస్ఆర్సీపీ దేనన్న

*ముస్లిం బాలుడి ఫీజుకోసం వాసుపల్లి రూ. 5000 సాయం*   * *వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో 1,70,467 మందికి అJమ్మవడి వచ్చింది*.   *  *తల్లికి వందనం లక్షకు పైగా అనర్హులు చేశారు*!   * *మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్*

ఎంతోమంది పిల్లలు బడి ఫీజులు అమ్మ ఒడి ద్వారా వస్తాయని ఎదురుచూసిన వారికి కూటమి ప్రభుత్వం నిరాశ మిగిల్చిందన్నారు. ఈ చేతకాని ప్రభుత్వ విధానాల వలన సంక్షేమం నోచుకోని పేద ప్రజలు మళ్లీ వారి పిల్లల్ని స్కూలు మానిపించే పరిస్థితులు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. పేదవాళ్ళకి నాణ్యమైన విద్య అందించేందుకు కార్పొరేటర్ స్థాయిలో స్కూల్లో అభివృద్ధి చేసిన ఘనత జగన్మోహన్రెడ్డికి దక్కుతుందన్నారు. నాడు జగనన్న బడి పిల్లలకు అమ్మ ఒడి, కళాశాల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు అందజేసి విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం మళ్లీ ఆంధ్రప్రదేశ్ పాలనను అంధకారంలోకి నెట్టే ప్రయత్నాలు చేస్తోందన్నారు. సంవత్సరంలోనే విసుగు చెందిన ప్రజలు మళ్లీ జగనన్న సుపరిపాలనను కోరుకుంటున్నారని వాసుపల్లి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 39 వ వార్డు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు, సౌత్ బూతు కమిటీ అధ్యక్షుడు ముజీబ్ ఖాన్,30వ వార్డ్ అధ్యక్షుడు దశమంతలు మాణిక్యాలరావు , 38 వ వార్డ్ సన్యాసిరావు, సౌత్ యూత్ అధ్యక్షుడు తాడి రవితేజ, వేణు, సత్య, వెంకటి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow