రాష్ట్రంలో చదరంగం ఆడుటకు అర్హత సాధించిన క్రీడాకారులు చైతన్య చెస్ అకాడమీ ఆధ్వర్యంల

ఈరోజు విశాఖ జిల్లా ఓపెన్ -2025 చదరంగం సెలక్షన్స్ తుది ఫలితాలు. ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా, ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ తరుపున చైతన్య చెస్ అకాడమీ ఆర్గనైజర్ గా నిర్వహించబడింది. టోర్నమెంట్ డైరెక్టర్ డాక్టర్ రంగాల బాబురావు క్రీడాకారులను వారి తల్లిదండ్రులను మరియు చదరంగా శిక్షకులను ఉద్దేశించి, ఓపెన్ కోసం 235 మంది పాల్గొన్నారు. గెలిచిన మొదటి నలుగురు క్రీడాకారులు రాష్ట్ర ఓపెన్ -2025 చాంపియన్షిప్ జూన్ 7 & 8 తారీకు లోన ఎన్టీఆర్ జిల్లా లో పాల్గొంటారు. మీరు రాష్ట్ర చదరంగంలో ఆడి అక్కడ కూడా నేషనల్ వెళ్లడానికి అర్హత సాధిస్తారని మేము ఆశిస్తున్నాం. ఓపెన్ కోసం నిర్వహించిన రౌండ్లు:7 తుది ఫలితాలు కింద ఈ విధంగా ఉన్నాయి:- ఓపెన్:- గొర్లి నైనా 7 పాయింట్లతో 1500/- క్యాష్ ప్రైస్ తో మొదటి స్థానం, లంక మార్తాండ కుమార్ 6.5 పాయింట్లతో 1200/- క్యాష్ ప్రైస్ తో రెండవ స్థానం,వంశీ కృష్ణ ఆర్ 6 పాయింట్లతో 1000/- క్యాష్ ప్రైస్ మూడవ స్థానం, వెంకటేశ్వర రావు దుంపల 6 పాయింట్లతో 800/- క్యాష్ ప్రైస్ తో నాలుగవ స్థానం గెలుచుకున్నారు. .

రాష్ట్రంలో చదరంగం ఆడుటకు అర్హత సాధించిన క్రీడాకారులు చైతన్య చెస్ అకాడమీ ఆధ్వర్యంల

గెలిచిన క్రీడాకారులు అతిధులు చేతులు మీదుగా క్యాష్ ప్రైస్, ట్రోఫీలు సర్టిఫికెట్లు అందుకున్నారు.

ముఖ్యఅతిథిగా:- శ్రీమతి సునీత గారు,

శ్రీ డాక్టర్ రంగాల బాబురావు టోర్నమెంట్ డైరెక్టర్ మరియు ప్రెసిడెంట్ ఆల్ విశాఖ అసోసియేషన్

శ్రీ మణికంఠ సెక్రెటరీ ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్

ఆర్బిటర్స్:- ఎం వి ఎస్ ప్రసాద్, రవితేజ, కృష్ణమోహన్ భార్గవ్, దుర్గ. ఆర్గనైజర్స్ కార్యకర్తలు పాల్గొన్నారు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow