అరసవిల్లి సూర్యనారాయణ దేవస్థానం స్వామిని దర్శించుకున్న మంత్రి గింజలకు రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో రథసప్తమి మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్, ప్రముఖ గాయనీ మంగ్లీ సహా కుటుంబ సభ్యులతో కలిసి వేకువజామున క్షీరాభిషేక సేవలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలను పొందారు. ఈ సందర్భంగా కింజరపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, "ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుని దర్శించడం అత్యంత శుభప్రదం. ఈ రథసప్తమి పర్వదినాన ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, శుభఫలితాలు కలగాలని ప్రార్థిస్తున్నాను" అని అన్నారు. .
మహోత్సవంలో భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివచ్చారు. ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు నిత్యాన్న ప్రసాదాలు అందజేశారు. రథసప్తమి సందర్భంగా సూర్యారాధన, వేదపారాయణం, హోమాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ మహోత్సవం పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై, స్వామివారి కృపను చేకూర్చుకున్నారు
What's Your Reaction?