21న ప్రధాన మంత్రి విశాఖపట్నం వస్తే పోలీసులు భద్రత కల్పించగలరా? సామాన్యులకు భద్రత ఇవ్వలేని పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టర్ దృష్టికి జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నిందితుల పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి పత్రం విశాఖ ను బీహార్ లాగా తయారు చేశారు... గాజువాక ఒక మాఫియాలో తయారయింది... మనుషుల్ని చంపేసినా పట్టించుకోని పోలీసుల ----

తెలుగు శక్తి అధినేత విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం పై జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన విషయాన్ని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్ హరేంద్ర ప్రసాద్ దృష్టికి సోమవారం ఉదయం తీసుకెళ్లినట్లు అలాగే నిందితుల పై చర్యలు తీసుకోవాలని,హాటల్ వద్ద జరిగిన సంఘటన తాలూక సిసీ ఫుటేజ్ బయట పెట్టాలని కోరినట్లు తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ తెలిపారు. కేసు డైరీ నెంబర్ 124787/IN/2025 గా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం మీద కేసు నమోదైన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ తనపై దాడి జరిగి మూడు వారాలు అయినప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పిన గాజువాక ఏసిపి, సీఐ ఆయన మాటలు కూడా లెక్క చేయడం లేదు. కేసు నమోదు చేయడంలేదు. విశాఖ ను బీహార్ లాగా తయారు చేశారు. గాజువాక అంతా ఒక మాఫియాలో తయారయింది.

21న ప్రధాన మంత్రి విశాఖపట్నం వస్తే పోలీసులు భద్రత కల్పించగలరా?  సామాన్యులకు భద్రత ఇవ్వలేని పోలీస్ డిపార్ట్మెంట్  కలెక్టర్ దృష్టికి జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు  నిందితుల పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి పత్రం  విశాఖ ను బీహార్ లాగా తయారు చేశారు...   గాజువాక ఒక మాఫియాలో తయారయింది...  మనుషుల్ని చంపేసినా పట్టించుకోని పోలీసుల         ----

సామాన్యులకు భద్రత ఇవ్వలేని పోలీస్ డిపార్ట్మెంట్... 21న ప్రధాన మంత్రి విశాఖపట్నం వస్తే భద్రత కల్పించగలరా అనే అనుమానం వ్యక్తం చేశారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, వారి అనుచరులు వంద మందికి పైగా నా పై దాడికి పాల్పడ్డారని, గాజువాక పోలీసులకు పిర్యాదు చేసినా, పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినా కేసు నమోదు చేయలేదు అన్నారు. జిల్లా మెజిస్ట్రేట్ గా కలెక్టర్ దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మనుషుల్ని చంపేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

*పల్లా ముఖ్య అనుచరుడు మురళియే ప్రధాన నిందితుడు*

పల్లా శ్రీనివాస్ ముఖ్య అనుచరుడు మురళి నా పై దాడికి సూత్రదారి అని, మిగతా వాళ్లని ప్రేరేపించి, పురిగొల్పి నా పై దాడి చేయించారని చెప్పారు. 100 మంది వరకు నా మీదకి దాడి చేసేందుకు వచ్చారన్నారు. నా పై జరిగిన హత్యాయత్నం లో ప్రసాదుల శ్రీనివాస్ ప్రమేయం కూడా వుంది అన్నారు. పల్లా శ్రీనివాస్ తో పాటు వీరి పైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow