సత్యడా లోవరాజు మెగాడీఎస్సీ-2025లో ప్రతిభ
విశాఖపట్నం, ఆగస్టు 25 విశాఖపట్నంకు చెందిన సత్యడా లోవరాజు ఏపీ మెగాడీఎస్సీ 2025లో ప్రతిభ చాటాడు. స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ విభాగంలో 40వ ర్యాంకు, టిజిటి సైన్స్ రెసిడెన్షియల్ జోన్–1 కేటగిరీలో 70వ ర్యాంకు, టిజిటి సైన్స్ మోడల్ స్కూల్ జోన్–1 కేటగిరీలో 120వ ర్యాంకు సాధించాడు. మూడు పరీక్షల్లోనూ విజయవంతమైన ఫలితాలు రావడం పట్ల లోవరాజు హర్షం వ్యక్తం చేశారు. తాను ఆప్షన్లలో స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్‌ను ఎంచుకున్నట్టు తెలిపారు
.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉపాధ్యాయులు లోవరాజుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలు సాధించాలని ఆకాంక్షించారు.
What's Your Reaction?