విజయసాయి రెడ్డినీ కలిసిన వాసుపల్లి

ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇన్చార్జ్రా జ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డితో వాసుపల్లి గణేష్ కుమార్ బేటి అయ్యారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనను కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ సాయి రెడ్డి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్రలో మళ్లీ వైసిపి పార్టీ కి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాక కోసం ప్రజలు వేచి చూస్తున్నారని ఈ సందర్భంగా వాసుపల్లి వెల్లడించారు జగన్మోహన్ రెడ్డి అందించిన అనేక సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు చేదోడుగా వాదోడుగా నిలిచాయన్నారు నేడు అధికారంలోకి వచ్చిన అబద్దాల బాబు ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ అందించకపోగా నట్టెంటా ముంచేలా ప్రజలపై కోట్ల రూపాయల విద్యుత్ భారం మోపుతోందని మండిపడ్డారు. ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు పెంచబోమని అధికారంలోకి వస్తే తగ్గిస్తామని ప్రగల్బాల్ పలికి నేడు అబద్ధాల బాబు అధికారంలోకి వచ్చి భారీగా విద్యుత్ చార్జీలు పెంచి సామాన్య ప్రజలను ఎప్పటిలాగే మోసం చేశారని వాసుపల్లి తెలిపారు

విజయసాయి రెడ్డినీ కలిసిన   వాసుపల్లి

వైసీపీ సంక్షేమ పాలన... కూటమి ప్రభుత్వం మోసం రెండింటిని ప్రజల రుచి చూశారని ఈసారి జగన్ కి పట్టం కట్టేందుకు ప్రజలు ఎన్నికల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా చార్జీల పెంపును తక్షణమే నిలిపివేయాలని, అలాగే ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు కొనసాగించాలని వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow