విశాఖలో ఉర్రూత లూగించిన నందమూరి బాలక్రిష్ణ నిర్విరామ సంగీత విభావరి -ఇంత పెద్ద భారీ సంగీత విభావరి తానెక్కడా చూడదలేదన్న సిపి శంఖబ్రతబాగ్జీ

-కళాకారులు, యువతకు, సామాజిక సేవలు చేయడంలో ముందుంటున్న డా.కంచర్ల -బాలక్రిష్ణపై అభిమానమే ఈ సంగీతవిభావరికి రూపమన్న ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా.కంచర్ల (విశాఖపట్నం-ఈరోజు, మార్చి 06) విశాఖలో ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్, కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్పేర్ అసోసియేషన్ సంయుక్తంగా రూపొందించిన పద్మభూషన్ నందమూరి బాలక్రిష్ణ నిర్విరామ సంగీత విభావరి కళా, సంగీత ప్రియులను ఉర్రూత లూగించింది. మునుపెన్నడూ లేనివిధంగా భారీ ఎత్తున 100 బాలక్రిష్ణ పాటలు, 200 మంది గాయకులతో ఏర్పాటు చేసిన సంగీత విభావరి ఆహుతలను శ్రవణానందాన్ని పంచింది. అబ్బా నీవాలు కళ్లు.. జోడు పిస్తోలు గుళ్లు... జై బాలయ్య జై జై బాలయ్య.. సమరసింహారారెడ్డి పాటలకు బాలక్రిష్ణ అభిమానులు కేకలు ఈలలతో కళావేదికను ముంచెత్తారు. కొందరు అభిమానులు ఏకంగా డాన్సులు వేయడంతో ఆహుతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మధ్య మధ్యలో ఏర్పాటు చేసిన సాంస్క్రుతిక కార్యక్రమాలు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. విశాఖలో భారీ ప్రోత్సహక కార్యక్రమాలు ఏర్పాటు చేసే ప్రముఖ సినీ నిర్మాత డా. కంచర్ల అచ్యుతరావు బాలక్రిష్ణ అభిమాని కావడం,

విశాఖలో ఉర్రూత లూగించిన నందమూరి బాలక్రిష్ణ నిర్విరామ సంగీత విభావరి -ఇంత పెద్ద భారీ సంగీత విభావరి తానెక్కడా చూడదలేదన్న సిపి శంఖబ్రతబాగ్జీ

ఎప్పటి నుంచి భారీ సంగీత విభావరి ఏర్పాటు చేయాలన్న బాలయ్య అభిమానుల కోరిక మేరకు నిర్వహించిన నిర్విరామ సంగీత విభావరి అందరికీ ఆనందాన్ని పంచింది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా, హైదరాబాదు నుంచి కూడా గాయకులు, గాయనీ మనులు తరలి వచ్చి ఒకరి కంటే మరొకరు పోటీ పడి మరీ గమ గానాన్ని బాలయ్య పాటల రూపొంలో వినిపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్వాహకులు, ప్రముఖ సంఘసేవలకులు, ఏపి ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు, కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్పేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డా. కంచర్ల మాట్లాడుతూ, తాను పద్మభూషన్ నందమూరి బాలక్రిష్ణకు వీరాభిమానినని.. ఆయనపై ఇష్టం, అభిమానమే ఇంతటి భారీ సంగీత విభావరి ఏర్పాటుకి కారణం అయ్యిందన్నారు. విశాఖలో కళలకు, కళాకారులకు, గాయకులకు కొదవలేదని.. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా వారిలోని టాలెంట్ ను సినీ పరిశ్రమకు తెలియజేయాలనే సంకల్పంతో బాలక్రిష్ణ సినిమాల్లోని 100 పాటలో ఈ నిర్విరామమ సంగీత విభావరిని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ తరహా కార్యక్రమాలు రానున్నరోజుల్లో కూడా ఏర్పాటు చేస్తామన్న ఆయన విశాఖకు సినిమా పరిశ్రమను పూర్తిగా తరలించేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నట్టు వివరించారు. తద్వారా 24 ఫ్రేమ్స్ లో పనిచేసే వారందరికి ఉపాది దొరకడంతోపాటు, సినీ నిర్మాతలకు కూడా ఇక్కడి ప్రత్యేకమైన, పర్యాటక ప్రాంతాల లొకేషన్లు సినిమా నిర్మాణాలకు ఉపయోగపడతాయని అన్నారు. అనంతరం గాయకులు, గాయనీ మణులు, డా. కంచర్లకు భారీ గజమాలతో సత్కారం ఏర్పాటు చేశారు. నగర సీపి డా.శంఖబ్రత బాగ్జీ మాట్లాడుతూ, విశాఖలో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం సాధారణ విషయం కాదని.. ఒకరోజంతా వంద పాటలు అందులోనూ కేవలం బాలక్రిష్ణ సినిమాల్లోని పాటతో సంగీత విభావరి కార్యక్రమం ఏర్పాటు చేయడం తాను ఎక్కడా చూడలేదని.. కనీసం మీడియాలో కూడా ఇంతపెద్ద కార్యక్రమం జరిగినట్టు చదవలేదున్నారు. కళాకారులను ప్రోత్సహించడానికి చేపట్టిన ఇలాంటి కార్యక్రమాలన ఎందరో టాలెంట్ ను బయటకు తీయడానికి ఆస్కారం వుంటుందన్నారు. ప్రతీ ఒక్కరిలోనూ కళ వుంటుందని.. అలాంటి కళను ప్రోత్సహించే డా.కంచర్ల అచ్యుతరావులాంటి వారు ఉంటే ఇంటికొక కళాకారుడు తయారు అవుతాడని కితాబిచ్చారు. ఇలాంటి ఎంటర్ టైన్ మెంట్ కార్యాక్రమాల ద్వారా కళాకారుల గుర్తింపుని మరింత మెరుగు పరుచుకోవడానికి వీలుపడుతుందన్నారు. నిరంతరం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే డా.కంచర్ల అచ్యుతారావులాంటి వ్యక్తుల వలన చాలా మందికి సహాయ, సహకారాలు అందుతున్నాయని అన్నారు. పలువురు ప్రముఖులు మాట్లాడుతూ, డా.కంచర్ల సేవలను, ఆయన కళాకారుల కోసం చేపట్టే సేవ, ప్రోత్సాహక కార్యక్రమాలను కొనియాడారు. అనంతరం మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన పది మంది మహిళలను (వెంకటలక్ష్మి సౌబిండి, తాసుబెల్లి ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవలు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య అధ్యక్షులు విమలకుమారి, డబ్బీరు ప్రశాంతి పట్నాయ్, వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు, సమాజసేవకులు రఘుపాత్రుని లీలాకుమారి, డబ్బీరు గాయత్రి ఏవిఎస్ తెలుగు ఆచార్యులు, సంఘసేవకులు, జి.పద్మమ, , సుంకరి సూర్యకుమారి, రాఘవమ్మ, స్టేజి ఆర్టిస్టు హేమ వెంకటేశ్వరి తదితరులకు) స్వయంగా సిపి శంఖభ్రత బాగ్జీ, డా. కంచర్ల అచ్యుతరావులు ఘన సన్మానం చేసి.. సత్కరించారు. మహిళా దినోత్సవం అంటే మార్చి 8న ఒక్కరోజే చేసి ఊరుకోవడం కాదని.. ప్రతీరోజు ప్రపంచమంతా మహిళా దినోత్సవం అందరూ జరుపుకోవాలన్నారు. మహిళ లేకపోతే ఈ అవని లేదన్నారు. అమ్మగా, చెల్లిగా, అక్కగా, భార్యగా, ఆ దేవతా మూర్తి విజయవాడ కనకదుర్గమ్మగా మహిళలు లేకుండా ఈ సృష్టేలేదని.. అలాంటి మహిళలకోసం ఒకరోజు కాదని 365రోజు ప్రత్యేకంగానే మహిళా దినోత్సవాలు జరుపుకోవాలన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ఎలాంటి కష్టం వచ్చినా ఇబ్బందులు వచ్చినా వెంటనే తనని సంప్రదించవచ్చునని, సిపి వాట్సప్ నెంబరును అందరికీ ఇచ్చారు. ఈ నెంబరు ప్రతీ మహిళ దగ్గర కుటుంబంలోని ఆడపిల్లలందరికీ ఇవ్వాలని సూచించారు. అనంతరం సిపిని డా.కంచర్ల అచ్యుతరావు గజమాలతో సత్కరించి, దుస్సాలువా, మెమోంటోలతో తస్కరించారు. తదుపరి డా.కంచర్లను సిపి కూడా గజమాలతో సత్కరించారు. కళలను, కళాకారులను ప్రోత్సహించే ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు మున్ముందు మరిన్ని చేయాలన్నారు. విభావరితో అత్యుత్తమంగా పాడి మొదటి ప్రైజ్ రూ.15వేలు గెలుచుకున్న ఉమాప్రసాద్, జ్యోతి, సెకెండ్ ప్రైజ్ గెలుచుకున్న షేక్ మదీనా రాజేశ్వరిలకు రూ.10వేలు, థర్డ్ ప్రైజ్ గెలుచుకున్న ఎ.రాజు, సుజాతలకు రూ.5 వేలును సిపి స్వయంగా అందజేసి వారిని సత్కరించారు. కొంతసేపు బాలక్రిష్ణ సినిమాల్లోని హిట్ సాంగ్స్ ను గాయకులు లైవ్ మ్యూజిక్ తో పాడిన విధానాన్ని స్వయంగా తిలకించారు. బాలయ్య నిర్విరామ సంగీత విభావరిలో పాల్గొన్న గాయకుల జంటలందరినీ డా.కంచర్ల ప్రత్యేకంగా సత్కరించి వారికి ప్రోత్సాహకాలను అందించారు. అంతకుముందు, సిపి శంఖబ్రత బాగ్జీ, డా.కంచర్ల అచ్యుతరావులను కంచర్ల మహిళా శక్తి సభ్యులు, మేల తాళాలు, డప్పువాయిద్యాలు, పూల వర్షంతో, మంగళ హారతులతో కార్యక్రమంలోని స్వాగతం పలికారు. కార్యక్రమం ఆధ్యంతం వీనుల విందుగా సాగింది. ఈ కార్యక్రమంలో కెవిఆర్ ఫౌండేషన్ ఫౌండర్, ప్రియదర్శిని ఇంటిగ్రేటెడ్ అసోసియేషన్ అధ్యక్షులు, హ్యమన్ రైట్స్ స్టేట్ వర్కింగ్ ప్రసిడెంట్ కె.ఇందిరా ప్రియదర్శిని, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు మేనేజర్ సుధీర్, నాగు, అరుణ, బాలక్రిష్ణ అభిమాన సంఘాల నాయకులు, కళాకారులు, సంగీత అభిమానులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow