కాపుల అభ్యున్నతికి నిధులు కేటాయించాలి ఈడబ్ల్యూఎస్ లో 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి ప్రభుత్వానికి లేఖ రాసిన ఏపీ కాపు అభివృద్ధి సంక్షేమ సంఘం
విశాఖపట్నం, ఆగస్టు 6: ఆంధ్రప్రదేశ్లో 18 శాతంగా ఉన్న కాపుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పదివేల కోట్లు కేటాయించి కాపుల అభివృద్ది సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాపు అభివృద్ధి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆరేటి ప్రకాష్ కోరారు. విశాఖ పౌర గ్రంథాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులంతా ఐక్యంగా పని చేశారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుతో సామాజిక వర్గమంతా ఒక్కతాటిపైకి వచ్చి పని చేశారన్నారు. అలాంటి కాపులను అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని సూచించారు. ఈడబ్ల్యూఎస్ లో 5 శాతం రిజర్వేషన్ ను పక్కాగా అమలు చేయాలని గతంలో చంద్రబాబు గారు పాస్ చేసిన యాక్ట్ 14/19 అమలు చేస్తూ జారీ చేసిన GO 45/19 తక్షణమే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పీ4 పథకంలో కాపుల సంక్షేమానికి పాటు పడాలన్నారు. జనగణన, కులగణనలో కాపుల వాస్తవ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని సహాయ సహకారాలు అందించాలన్నారు. జనరల్ సెక్రటరీ బి.ఎన్.మూర్తి మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయలు జయంతి వర్థంతులను రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలుగా చేపట్టాలన్నారు.
కాపులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా సహకారం అందించాలని విన్నవించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు కె.వి.వి.ఎస్.సత్యనారాయణ, గొల్లకోట సుబ్బారావు, బి.రామజోగి పాల్గొన్నారు.
What's Your Reaction?