అలరించిన ‘బుట్ట బొమ్మ మద్దిలపాలెం లో బొమ్మన వారి శారీ స్టోర్ ప్రారంభం
.. విశాఖపట్నం, డిసెంబర్ 25 వస్త్ర వ్యాపార రంగంలో 93ఏళ్ల అనుభవం ఉన్న ‘బొమ్మన’ సంస్థ విశాఖలోని మద్దిలపాలెంలో మరో శాఖ గా శ్రీ బుట్ట బొమ్మ పేరిట శారీ స్టోర్ ను బుధవారం ప్రారంభించారు. ఈ మేరకు సంస్థ అధినేత బొమ్మన సత్యరాజ్ కుమార్ కుటుంబ సభ్యులు శారీ స్టోర్ ను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నమ్మికకు, నాణ్యతకు ప్రాధాన్యత ను ఇస్తూ ఆధునిక డిజైన్ల తో కూడిన అన్ని చీరలు బుట్ట బొమ్మ శారీ స్టోర్ లో లభ్యమవుతాయన్నారు. 93 ఏళ్ళు గా బొమ్మన కుటుంబాన్ని ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని వారి అభిరుచికి అనుగుణంగా సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు చేరువ చేసేందుకే ‘బుట్ట బొమ్మ’ను ప్రారంభించామని తెలిపారు .
బుట్ట బొమ్మ’ అధినేత బొమ్మన మణిరాజ్ కుమార్ మాట్లాడుతూ సంప్రదాయం ఉట్టిపడేలా గద్వాల్, కంచి, ధర్మవరం వంటి చీరలు అందుబాటు ధరల్లో లభ్య మవుతాయన్నారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించేలా వస్త్రాలను ఇక్కడ విక్రయించనున్నట్లు తెలిపారు. బొమ్మన సిల్క్స్ అధినేత బొమ్మన యువరాజ్ కుమార్ మాట్లాడుతూ వస్త్ర వ్యాపారాన్ని తమ కుటుంబం తరాలు గా కొనసాగిస్తుందని, వారి బాటలో తాము కూడా విలువలతో షో రూంలు నడుపుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో బొమ్మన సునీత, బొమ్మన సంజన, బొమ్మన చంద్రిక తదితరులు పాల్గొన్నారు
What's Your Reaction?