భక్తుల వరప్రదాయిని ముత్యాలమ్మ అమ్మవారు

విశాఖపట్నం, ఆగస్టు 8 పిలిచిన వెంటనే పలికే అమ్మవారు, భక్తులకు వరాల నొసెగే ముత్యాలమ్మ అమ్మవారు ఓల్డ్ సీబీఐ డౌన్‌లో వెలసి భక్తుల కంటి పాపలా కాపాడుతున్నారని ఆలయ అర్చకులు వెలవలపల్లి వేంకటేశ్వర శర్మ తెలిపారు. శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయంలో భక్తురాలు రాజ్యలక్ష్మి సహా పలువురు విశిష్ట పూజలు నిర్వహించారు.

భక్తుల వరప్రదాయిని ముత్యాలమ్మ అమ్మవారు

ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ పీతల అమరేంద్ర, నక్కాన పెంటయ్యబాబులు, నక్కాన రామయమ్మ, బొట్టా సోమన్న జ్ఞాపకార్థం బొట్టా అప్పారావు, అమరావతి, గుంటుబోయిన నారాయణ రావు, మద్ది అప్పలరెడ్డి, గుంటుబోయిన అశోక్ కుమార్ తదితరులు ఎంతో కృషి చేసి ఆలయాన్ని అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.

శ్రావణమాసం ముగిసే 28వ తేదీ వరకు ఆలయంలో కుంకుమపూజలు, అర్చనలు, విశిష్ట హోమాలు జరుగుతాయని, భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని అర్చకులు ఆకాంక్షించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow