డాక్ యార్డ్ కేటీబీ నూతన కార్యవర్గం* *సమిష్టిగా రక్షణ రంగ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం* *సంక్షేమం అభివృద్ధికి ప్రాధాన్యత* ,*గౌరవ అధ్యక్షులుగా గంట్ల శ్రీనుబాబు* అధ్యక్ష, కార్యదర్శులుగా చిరంజీవి, భాస్కరరావు
* ఎన్ ఏడి జంక్షన్, ఆగస్టు 8 డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా గంట్ల శ్రీనుబాబు, అధ్యక్ష, కార్యదర్శులుగా బత్తుల చిరంజీవి, విజనగిరి భాస్కరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా విరోతి వెంకటేష్, అడిషనల్ జనరల్ సెక్రటరీగా యాతము రాజ్ కుమార్, కోసాధికారిగా గనిరెడ్డి శ్రీనివాస్ తో కలిపి మొత్తం 27 మందిని నూతన కార్యవర్గంగా ఎన్నికయ్యారు. శ్రావణశుక్రవారం, వరలక్ష్మీ వ్రతం నేపధ్యంలో సంఘం గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అధ్యక్షతన కార్యవర్గ సభ్యులు అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం తొలిసమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ రంగంలో సేవ చేసే అవకాశం లభించడం ప్రతి ఒక్కరూ పూర్వ జన్మసుకృతంగా భావించాలన్నారు. అలాగే గతం కంటే మరింత వేగవంగా సంఘాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందరి సహకారంతో కేటిబి కళాక్షేత్రాన్ని నిర్మించి అందుబాటులోకి తెచ్చుకోగలిగామన్నారు. అందులో ఒక అంతస్తుకు తాను దాత కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. అధికారుల, ఉద్యోగుల సంక్షేమానికి (సభ్యుల) తన వంతు కృషి చేస
అధ్యక్ష, కార్యదర్శులు బత్తుల చిరంజీవి, విజనగిరి భాస్కరరావులు మాట్లాడుతూ సభ్యుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే ఏడాదిలో వైధ్య, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు సభ్యుల పిల్లలకు ఉపకార వేతనాలు అందజేస్తున్నామన్నారు. అంతేకాకుండా ఇతర పండుగలు నిర్వహిస్తున్నామన్నారు. సభ్యులకు అసోసియేషన్ నిరంతరం అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం పలు తీర్మాణాలు చేసింది. మూడేళ్ల పాటు ఈ కార్యవర్గం కాలపరిమితిగా నిర్ణయించారు. అలాగే పలువురు సీనియర్ లను సలహాదారులుగా , కొందరు న్యాయవాదులను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించుకోవాలని వీరంతా నిర్ణయం తీసుకున్నారు. నూతన కార్యవర్గానికి సభ్యులంతా అభినందనలు తెలియజేశారు.
What's Your Reaction?