స్వర్గీయ. ద్రాణం రాజు శ్రీనివాస్ 64వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు.
విఎంఆర్‌డిఎ మాజీ ఛైర్మన్,మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ శ్రీ ద్రోణంరాజు శ్రీనివాసరావు గారి 64వ జయంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి గారు* ఈరోజు విశాఖపట్నంలో వన్ టౌన్ స్వామి వివేకానంద సంస్థలో వైస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు ద్రోణంరాజు శ్రీవత్సవ గారు ఆధ్వర్యంలో ద్రోణంరాజు శ్రీనివాసరావు గారి జయంతి కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు
.ఈ కార్యక్రమంలో విశాఖపట్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు,మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు,నగర మేయర్ శ్రీమతి హరి వెంకటకుమారి గారు,రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు,శాసన మండలి సభ్యురాలు శ్రీమతి వరుదు కళ్యాణి గారు,మాజీ వుడా చైర్మన్ PSN రాజు(వుడా రవి) గారు,మాజీ జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కర రావు గారు,జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు బోని శివ రామ కృష్ణ గారు,కార్పొరేటర్లు,మాజీకార్పొరేటర్లు,వార్డు అధ్యక్షులు,ఇతర ప్రజా ప్రతినిధులు
తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?