నియామక పత్రాలు అందజేసిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్
సెమ్స్ లో వైజాగ్ జనరల్ కార్గో బెర్త్ (VGCB) సహకారంతో ఉచిత ఉపాధి శిక్షణ కార్యక్రమం మొదటి బ్యాచ్ కి సెమ్స్ లో వైజాగ్ జనరల్ కార్గో బెర్త్ (VGCB) సహకారంతో ఉచిత ఉపాధి శిక్షణ కార్యక్రమం మొదటి బ్యాచ్ కి నియామక పత్రాలు అందజేత కార్యక్రమం వైజాగ్ జనరల్ కార్గో బెర్త్ (VGCB) కార్పొరేట్ సామాజిక బాధ్యత లో (CSR) భాగంగా షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ స్థాపించిన సెంటర్ అఫ్ ఎక్స్లెన్స్ ఇన్ మారిటైం అండ్ షిపిబిల్డింగ్ (సెమ్స్) సహకారంతో పోర్ట్ పరిసర ప్రాంత మరియు GVMC పరిధిలోని
90 మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి ఆధారిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా మొదటి బ్యాచ్లో శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు నియామక పత్రాలను దక్షిణ నియోజకవర్గం MLA శ్రీ వంశి కృష్ణ శ్రీనివాస్ గారి చేతులమీదుగా అందచేయటం జరిగిందని సెమ్స్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ కే. సేతు మాధవన్ ఒక ప్రకటనలో తెలిపారు.
చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన శ్రీ వంశి కృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశానుసారం కూటమి ప్రభుత్వం ఏడాదికి 1,20,000 మంది నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఉపాధి కల్పించటం లక్ష్యంగా పెట్టుకుందని దీనిలో భాగంగా సెమ్స్ లాంటి సంస్థల అవసరం ఎంతో ఉందని, విజయవంతంగా శిక్షణ కార్యక్రమం పూర్తి చేసుకున్న మహిళా అభ్యర్థులను అభినందిస్తూ సభాముఖంగా చెప్పటం జరిగింది.
వీజీసీబీ సంస్థ COO శ్రీ పవన్ కుమార్ గారు మాట్లాడుతూ, మొదటి బ్యాచ్ లో ౩౦ మంది మహిళా అభ్యర్థులకు ఇన్వెంటరీ కంట్రోలర్ కోర్సులో శిక్షణ ఇచ్చామని మరియు ౩౦ మందితో ఎలక్ట్రీషియన్ బ్యాచ్ ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వీజీసీబీ CSR హెడ్ కుమారి శ్రీలక్ష్మి, కుమారి క్రీన విపుల్ మరియు సెమ్స్ నుండి COO కమాండర్ గోపి కృష్ణ శివ్వం, IN (రిటైర్డ్), ప్రాజెక్ట్ హెడ్ శ్రీ ప్రజీత్ కురుప్ తో పాటు వెస్ట్ జనసేన పార్టీ ఇన్చార్జి, స్టేట్ డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి , స్థానిక కార్పొరేటర్ సురేష్ పాల్గున్నారు.
What's Your Reaction?