నవతరానికి నాంది స్త్రీశక్తి మానవత్వములోమేటి మహిళ

మహిళా జర్నలిస్ట్ లకువిశిష్ట ప్రతిభా పురస్కారాలు . డాబాగార్డెన్స్.. మార్చి 1 నవతరానికి స్త్రీ శక్తి నాంది అని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంక బ్రత బాగ్చి సతీమణి శుభోశ్రీ బాగ్చీ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా "ప్రజాపిత బ్రహ్మకుమారీస్ "ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శనివారం (డాబా గార్డెన్) వి.జే.ఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మహిళా మీడియా ప్రతినిధుల సత్కార కార్యక్రమము లో శుభో శ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశ్వ మనుగడలో "స్త్రీ"పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. సాంకేతిక, ఆధ్యాత్మిక, కుటుంబ నడవడిక వంటి విజయాలు మహిళల ఉత్సాహంపై ఆధారపడి ఉంటాయన్నారు. మానవత్వం.. త్యాగనిరతిని చాటి చెప్పడంలో మేటి మహిళా మణి ఒకస్ఫూర్తిదాయకమని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా పాల్గొన్న సి.ఐ.డి. ప్రాంతీయ ఉన్నతాదికారి ప్రేమ్ కాజల్ మాట్లాడుతూ నేడు అన్ని రంగాలలో మహిళలు మగవారితో పోటీపడుతూ సత్ఫలితాలను సాధిస్తున్నారని అన్నారు. మహిళా సామాజిక చైతన్యానికితోడ్పడే వార్తా కథనాలను విస్తృతంగా జర్నలిస్టులు అందించాలని సిఐడి అధికారి ప్రేమ్ కాజల్ పిలుపునిచ్చారు. ఆయా కధనాలు రాసి నప్ప

నవతరానికి  నాంది స్త్రీశక్తి  మానవత్వములోమేటి మహిళ

సింహాచలం దేవస్థానం ధర్మ కర్తల మండలి మాజీ సభ్యులు,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ మహిళామూర్తుల సేవలు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రతి ఏడాది మహిళా జర్నలిస్టుల ప్రతిభను ప్రోత్సహిస్తూ విశిష్ట ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నట్లు శ్రీనుబాబు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వాహకురాలుబ్రహ్మకుమారి ఈశ్వరీయ మెడిటేషన్ ఇన్చార్జి బి కె రామేశ్వరి అక్కయ్య మాట్లాడుతూ ఎక్కడైతే మహిళలు సంతోషంగా ఉంటారో, అక్కడ ప్రగతి చాయలు కనిపిస్తాయన్నారు.ప్రణాళిక బద్ధంగా , అంకితభావం, త్యాగాలకు మహిళలే చక్కని చిరునామాలుగా అభివర్ణించబడుతున్నారని తెలిపారు .నాటి సీతా దేవి నుంచి నేటి సునీతా విలియమ్స్ వరకు మహిళలు అన్ని రంగాల్లోవారు కోరుకున్న రీతిలో పురోగతి సాధించారు అన్నారు.సీనియర్ జర్నలిస్ట్ జాతీయ కొరియోగ్రాఫర్ ఆర్. నాగరాజు పట్నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొనగా, వారిలో 15 మంది మహిళ మీడియా జర్నలిస్టులకు, ఈనెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని విశిష్ట ప్రతిభా పురస్కారాలను నగర పోలీస్ కమిషనర్ సతీమణి శుభోశ్రీ చేతుల మీదుగా ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కళాకారిని చిన్ను చేసిన శాస్త్రీయ నృత్యం, డెబ్బీర్ హర్ష గీతాలు పలువురుని ఎంతగానో ఆకట్టుకున్నాయి..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow