ద్రోణంరాజ్ సత్యనారాయణకు ఘన నివాళులర్పించిన నగర మేయర్

విశాఖపట్నం డిసెంబర్ 19: స్వర్గీయ ద్రోణంరాజ్ సత్యనారాయణ రాష్ట్ర అభివృద్ధి తోపాటు విశాఖ నగరానికి ఎంతో సేవ చేశారని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. గురువారం ఆమె విశాఖపట్నం సిరిపురం కూడలి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి 92వ జయంతి సందర్భంగా శాసనమండలి పక్ష నేత బోచ్చా సత్యనారాయణ, విశాఖపట్నం వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ శాసనమండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ వైఎస్ఆర్సిపి పార్టీ సమన్వయకర్తలు కార్పొరేటర్లు, అభిమానులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు.

ద్రోణంరాజ్ సత్యనారాయణకు ఘన నివాళులర్పించిన నగర మేయర్

ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ సత్యనారాయణ పెందుర్తి సర్పంచ్ గా, శాసనసభ్యులుగా, లోక్ సభ సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా ,జిల్లా పరిషత్ చైర్మన్, ఇలా ఎన్నో పదవులు చేసి విశాఖ నగర అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఆయన చేసిన సేవలు విశాఖ నగర ప్రజలకు ఎప్పుడు గుర్తుండిపోతాయని ఈ సందర్భంగా తెలిపారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow