అ అంటే అనాధలు కాదు... ఆ అంటే ఆత్మీయులు” – వెన్నెల ట్రస్ట్ ఉద్వేగ నినాదంతో బాలికల కోసం ప్రత్యేక కార్యక్రమం

“ చీకటిలో మిగిలిన జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో స్థాపించబడిన ఎస్‌ఎస్‌ఎస్ వెన్నెల ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఈ నెల 16వ తేదీన విశాఖపట్నంలోని విఎంఆర్‌డిఏ చిల్డ్రన్స్ అరేనా లో ఓ ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ట్రస్ట్ సభ్యులు విశాఖ పబ్లిక్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ శ్రీ సదాశివుని రవితేజ మాట్లాడుతూ, “అ అంటే అనాధలు కాదు... ఆ అంటే ఆత్మీయులు” అనే భావనతో ఈ ట్రస్ట్‌ ను స్థాపించామని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆడపిల్లల సంరక్షణ, విద్య, వైద్యం, క్రీడల్లో పురోగతి వంటి రంగాలలో వారికి తోడుగా ఉండడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. 5 నుండి 18 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న బాలికలకు నీడగా నిలవాలనే ఆశయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రీమ్ షెల్టర్స్ సౌజన్యం అందించగా, ప్రముఖులు, కళాకారులు పెద్దఎత్తున పాల్గొననున్నారు. ప్రధాన ఆకర్షణలుగా: జబర్దస్త్ టీం కళాకారులు ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ సమీరా భరద్వాజ్ జానపద కళాకారులు సినీరంగానికి చెందిన ప్రముఖులు .

అ అంటే అనాధలు కాదు... ఆ అంటే ఆత్మీయులు” – వెన్నెల ట్రస్ట్ ఉద్వేగ నినాదంతో బాలికల కోసం ప్రత్యేక కార్యక్రమం

ఈ కార్యక్రమంలో పాల్గొని బాలికలకు ఆశాజ్యోతి కలిగించాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమం విజయవంతం కావడానికి మూన్ పవర్ ఈవెంట్స్ శ్రీనివాస్, ట్రస్ట్ సభ్యులు, డ్రీమ్ షెల్టర్స్ నిర్వాహకులు కృషి చేస్తున్నారని తెలిపారు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow