వాసుపల్లి ఆధ్వర్యంలో విజయదశమి వేడుకలు 104లో అంబరాన్నంటిన దసరా సంబరాలు... సిబ్బందికి దసరా కానుకలు అందజేసిన మాజీ ఎమ్మెల్యే..

మాజీ ఎమ్మెల్యే దక్షిణ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త, వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో 104 వద్ద విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శాంత రూపంలో శ్రీ దుర్గమాంబ అమ్మవారిని ప్రతిష్టించి ప్రతిరోజు వివిధ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి విశేష పూజలతో పాటు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు హోమాలతో అమ్మవారి పండుగను వైభవంగా నిర్వహిస్తుంటారు. విజయదశమి పర్వదినాన పురస్కరించుకొని కార్యాలయ సిబ్బందికి, వైసిపి శ్రేణులకు వాసుపల్లి గణేష్ కుమార్ దసరా కానుకలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడు నుండి మంచిని ఎదుర్కొనీ అంతిమ విజయం సాధించడమే విజయదశమి మనకు ఇచ్చే సందేశం అన్నారు. దుర్గమ్మ చల్లని ఆశీస్సులు ప్రజలందరిపై కరుణాకటాక్షాలు, దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. చండీయాగం, హోమయాగాలు చేసి అత్యంత ఘనంగా సారె నైవేద్యాలు, సమర్పించి అమ్మవారిని వివిధ సంస్కృతిక కార్యక్రమాలతో సోమవారం ఊరేగింపు నిమజ్జనం జరుగుతుందని

వాసుపల్లి ఆధ్వర్యంలో విజయదశమి వేడుకలు   104లో అంబరాన్నంటిన దసరా సంబరాలు...  సిబ్బందికి దసరా కానుకలు అందజేసిన మాజీ ఎమ్మెల్యే..

ఈ సందర్భంగా వాసుపల్లి తెలిపారు. విజయదశమి పర్వదినం ప్రజల జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం, శాంతి నింపాలని ఆకాంక్షించారు. పూజా కార్యక్రమంలో వాసుపల్లి కుటుంబ సభ్యులు తల్లి అమ్మాజీ, సతీమణి ఉషా, సూర్య లక్ష్మి సౌందర్య రాశి దంపతులు, గోవింద్ సాకేత్, కళాశాల సిబ్బంది, మహిళలు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow