మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద అన్నారు. వైద్యులు, సిబ్బంది విధి నిర్వహణలో బాధ్యతతో మెలిగేలా చూస్తున్నానన్నారు. ఆదివారం ఉదయం కేజీహెచ్ తన కార్యాలయంలో 2024 కు సంబంధించి కేజీహెచ్ సేవలు, అభివృద్ధి పనుల పై మీడియాతో మాట్లాడారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినా తరువాత కేజీహెచ్ ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్టు ఆయన తెలిపారు. కార్డియాలజీ, న్యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పిడియాట్రిక్స్, క్యాన్సర్ చికిత్స కు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయని, ఈ సేవలు ఉచితంగా అందించబడుతున్నాయని పేర్కొన్నారు. సేవా లోపాలను సరిచేసే దిశగా చర్యలు చేపట్టామని, ఎవరైనా సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తే 0891-2590102, 0891-2590100 నెంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ మేరకు రోగుల సహాయకులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.
What's Your Reaction?