వైభవంగా రామచంద్ర అమ్మవారి పండుగ మహోత్సవం . నూతన వస్త్రాలు సమర్పించిన గంట్ల దంపతుల

. పరవాడ మండలం, వాడ చీపురుపల్లి పంచాయతీ, దళాయిపాలెం గ్రామంలో కొలువున్న శ్రీ రామచంద్ర అమ్మవారి పండుగ మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి యేట సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ పండుగ మహోత్సవాన్ని ఈ ఏడాది కూడా ఆలయ నిర్వహణ కమిటీ అత్యంత ఘనంగా జరిపించింది. తెల్లవారుజామున అమ్మవారిని సుప్రభాత సేవతో మేలు కొలిపి,ఆరాధన గావించారు అనంతరం వేలాది మంది భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు.

వైభవంగా రామచంద్ర అమ్మవారి పండుగ మహోత్సవం . నూతన వస్త్రాలు సమర్పించిన గంట్ల దంపతుల

తొలుత నూతన వస్త్రాలు సమర్పించి పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ కోరిన కోర్కెలు తీర్చే కల్ప వల్లిగా రామ చంద్ర అమ్మవారు విరాజిల్లుతున్నారన్నారు..ప్రతి ఏటా తాము అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయతీగా వస్తుంది అన్నారు.ఈ సందర్భంగా అమ్మవారి ఆలయం నభారీ విద్యుత్ దీపాలతో విశేషంగా

 అలంకరించారు...

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow