ఎమ్మెల్సీ లేదా ఇతర ప్రాధాన్యత కలిగిన పోస్టు ఇవ్వాలని చంద్రబాబుకు విజ్ఞప్తి ఎప్పుడూ కూడా టీడీపి అని చెప్పుకోలేదు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఆకాంక్షలకు అనుగుణంగా పని చేశా

శారదా పీఠానికి 15 ఎకరాల విలువైన భూమిని కేటాయిస్తే దాన్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలాగా తెలుగు శక్తి కీలకమైన పోరాటం ఏకైక రాజధాని అమరావతికి తెలుగు శక్తి పోరాటం చేశా మద్దతు తెలుగు దేశం సభ్యుడు, తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ విశాఖపట్నం: తాను 2014 నుంచి తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా టీడీపి అని చెప్పుకోలేదని.. తెలుగు శక్తి పేరుతో గత వైసీపీ ప్రభుత్వం పై పోరు కొనసాగించానని.. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ అన్నారు. పార్టీలు మారకుండా తెలుగుదేశం పార్టీ పట్ల విధేయతతో పని చేశానని పేర్కొన్నారు. వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ను కలిశానని తెలిపారు. ఎమ్మెల్సీ లేదా తగిన ప్రాధాన్యత గల స్థానం కేటాయించాలని విజ్ఞప్తి చేశానన్నారు. ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించారని.. ముందు నుంచి కూడా తగిన స్థానం ఇస్తానని చెపుతూనే ఉన్నారని తెలిపారు. టీడీపి కోసం నిరంతరం పోరాటం చేసిన తాను చంద్రబాబు నాయుడు స్టాండింగ్ కు అనుగుణంగానే ఏకైక రాజధాని అమరావతి రాజధాని కోసం పోరాటం చేశ

ఎమ్మెల్సీ లేదా ఇతర ప్రాధాన్యత కలిగిన పోస్టు ఇవ్వాలని చంద్రబాబుకు విజ్ఞప్తి   ఎప్పుడూ కూడా టీడీపి అని చెప్పుకోలేదు   అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఆకాంక్షలకు అనుగుణంగా పని చేశా

ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇదిలా ఉండగా గత ప్రభుత్వం భీమిలిలో శారదా పీఠానికి 15 ఎకరాల విలువైన భూమిని కేటాయిస్తే దాన్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలాగా తెలుగు శక్తి కీలకమైన పోరాటం చేసిందని ఈ సందర్భంగా రామ్ పేర్కొన్నారు. మరోవైపు తెలుగు శక్తి పేరుతో పరోక్షంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగించిన ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేశానన్నారు. ఈ క్రమంలోనే తొమ్మిది పాటలను విడుదల చేసి వైసిపి దుర్మార్గాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని తెలిపారు. ఈ తొమ్మిది పాటలలో ఆరు పాటలను చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారన్నారు. మరో వైపు చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతికి, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసి జాతీయ స్థాయిలో గళం విప్పానని తెలిపారు. తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అభ్యున్నతికి వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు.

పాలూరు శేషమాంబ మాట్లాడుతూ.. మొదటి నుంచి తెలుగు దేశంతో రామ్ ప్రయాణం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఎన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా రామ్ కు తగిన గుర్తింపు లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు. మనం అడగ కుండానే ప్రతిభను గుర్తించి పట్టం కట్టాలని.. ఇదే క్రమంలో ఎమ్మెల్సీ గా పోటీ చేసే అవకాశం కల్పించాలన్నారు.

హ్యూమన్ రైట్స్ సభ్యుడు నాయుడు మాట్లాడుతూ.. ప్రజలు పోస్ట్ కార్డు ఉద్యమం చేయాలన్నారు. రామ్ కు MLC కోసం సీబీన్, లోకేష్ కు పోస్ట్ కార్డ్స్ పోస్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కళింగ కోమటి అధ్యక్షులు కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. ప్రాణాలకు లెక్క చేయకుండా రామ్ పోరాటం చేసిన రామ్ కు ఎమ్మెల్సీ లేదా ధీటైన పదవి ఇవ్వాలన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow