మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు రాష్ట్ర మత్స్యకార నాయకుల సమావేశం లో నేతలు
విశాఖపట్నం, ఏప్రిల్ 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నేడు విశాఖపట్నం పౌరగ్రంథాలయ సమావేశ మందిరంలో రాష్ట్ర మత్స్యకార ఉపకులాల ముఖ్యనాయకుల సమావేశం జరగింది. రాష్ట్ర నలుమూలల నుండి అధిక సంఖ్యలో మత్స్యకార నాయకులు పార్టీలకతీతంగా హాజరై, తమ సామాజిక వర్గాల అభివృద్ధికి అనుకూలంగా ఏ పార్టీ అయినా మద్దతు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశంలో, మత్స్యకార కులాలకు అన్యాయం చేస్తున్న జి.ఓ. నెం.217 రద్దు చేసినందుకు, జీవన భృతిని రూ.20,000కు పెంచినందుకు, ఆయిల్ సబ్సిడీ, వేట పరికరాల పంపిణీతో పాటు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వాన్ని సభ ప్రశంసించింది. మత్స్యకార ఉపకులాల రాజకీయ, ఆర్థిక, ఉపాధి, విద్యా రంగాల్లో పూర్తి స్థాయిలో మద్దతు అందించేందుకు కూటమి ప్రభుత్వంతో సహకారం కొనసాగించాలని నిర్ణయించారు. గత ప్రభుత్వ కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కృషి చేయాలని, రాబోయే రోజుల్లో 14 మత్స్యకార ఉపకులాలు ఐక్యంగా ముందుకు సాగాలని తీర్మానం చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు నడకుదిటి అర్జున్, ప్రధాన కార్యదర్శి చింతకాయల ముత్యాలు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, తో పాటు పీజీ అప్పారావు,తెప్పల శాంతారామ్, కాటా గోపి, తుమ్మల రమేష్, మాతా గురునాథరావు, పుట్టా శివ, సాయి బలరాం, జీవి రమణారావు, అంగ కృష్ణ, పలపల శ్రీనివాసరావు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన మత్స్యకార నాయకుల ఉత్సాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సమావేశంలో, జిల్లాల వారీగా కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించబడింది.
What's Your Reaction?