తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది తెలుగు దేశం పార్టీ తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్

తెలుగు దేశం పార్టీ ప్రజల పార్టీ అని ఆ పార్టీ ప్రభంజనాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదని తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని బీచ్ రోడ్ లో ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ శనివారం ఉదయం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ.. వైయస్ జగన్మోహన్ రెడ్డి 2010లో పార్టీని పెట్టి 2019లో అధికారంలోకి వచ్చారన్నారు. అంటే దాదాపు తొమ్మిదేళ్ల పాటు తర్వాత అధికారం వచ్చిందన్నారు. కానీ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి ప్రపంచ రికార్డు సాధించారన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన అన్న నందమూరి తారక రామారావు ప్రేరణతో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు మూలస్థంభాలు గా నిలిచి 2024 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సాగనంపి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు చేసి తెలుగువారి పౌరుషం చాటి చెప్పారు.

తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది తెలుగు దేశం పార్టీ   తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్

టిడిపి 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో తెలుగు దేశం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి బోడేపూడి దొరబాబు, మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్యాం ప్రసాద్, టిడిపి 14 వ వార్డు అధ్యక్షుడు పి.వి.వసంతరావు, లాడి కిషోర్ కుమార్,ఈ.సత్తిబాబు, దువ్వి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow