విద్యాంధ్రప్రదేశ్ ను మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేశార ప్రజలకు సంక్షేమానందించి నూతన వెలుగును నింపండి. ఏడు నెలల పాలన ఏడిపించే పాలనగా మారింది.
. - నూతన సంవత్సర దినోత్సవ వేడుకల్లో వాసుపల్లి గణేష్ కుమార్ జగనన్న హయాంలో ఉన్న విద్యాంధ్రప్రదేశ్ నీ నేడు కూటమి ప్రభుత్వం మద్యంఆంధ్రప్రదేశ్ గా తయారు చేశారని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ మండిపడ్డారు. ఆశీలమెట్ట కార్యాలయంలో నూతన సంవత్సర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని దక్షిణ వైసిపి శ్రేణులతో కలిసి కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ గత మేనిఫెస్టోను టిడిపి వెబ్సైట్ నుంచి తొలగిస్తే.. నేడు మేనిఫెస్టోను చంద్రబాబు తన మెమొరీ నుంచి తీసేసాడని దుయ్యబట్టారు. అబద్దాలాడి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ ను గాలికి వదిలేసిందనీ ఆరోపించారు. ఏడు నెలల కూటమిపాలన పూర్తిగా అట్టర్ ప్లాప్ అయిందన్నారు. గత ప్రభుత్వంలో కంటే 80% మద్యం 40% బీర్ల విక్రయాలు జరిగాయన్నారు. సంపద సృష్టించడం అంటే ఇదే నా చంద్రబాబు అంటూ వాసుపల్లి ప్రశ్నించారు. సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలోనూ గంజాయి సాగు విచ్చలవిడిగా ఉందన్నారు.
గతంలో జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులను పథకాలతో పాటు నష్టపోయిన అనేక దుర్ఘటనలో తక్షణ సహాయంతో ఆదుకున్నారనీ గుర్తు చేశారు. మత్స్యకారులు అంటే చిన్న చూపు చూస్తున్న చంద్రబాబు వైఖరి మార్చుకోవాలన్నారు. ఏడు నెలల పాలన కాస్త ప్రజలను ఏడిపించే పాలనగా మారిందన్నారు. నాడు జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలతో పేద మధ్య తరగతి కుటుంబాల్లో వెలుగులు నిండాయన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వలన మరల వారి జీవితాల్లో చీకటి అలుముకున్నాయన్నారు. ఈ నూతన సంవత్సర దినోత్సవ సందర్భంగా ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం బుద్ధి మార్చుకొని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా నాడు జగనన్న పథకాలతో పాటు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ ను కూడా ప్రజలకు అందించాలని వాసుపల్లి గణేష్కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దక్షిణ ప్రజలకు, వైసీపీ శ్రేణులకు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో 34 వ వార్డ్ కార్పొరేటర్ తోట పద్మావతి , 27వ వార్డ్ మాజీ కార్పొరేటర్ అమ్మాజి , వార్డ్ అధ్యక్షులు పీతల వాసు, దశమంతులు మాణిక్యాలరావు & చిన్ని, దొడ్డి బాపు ఆనంద్,అలుపన కనక రెడ్డి,బిసెట్టి ప్రసాద్, మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ముజీబ్ ఖాన్,ఆలయ గుడి చైర్మన్లు లండ రమణ, వడ్డది దిలీప్,మాజీ డైరెక్టర్ నాగమణి,నీలపు లక్ష్మి,వాసరాల సుబ్రహ్మణ్యం ( బుజ్జి), వైజాగ్పాఠం రాజ్ పాత్రుడు,వివేకానంద అప్పారావు,తాడి రవి తేజ,కోన శంకర్, కోన ప్రకాష్,వాసుపల్లి రాజ్ కుమార్,బేవార మహేష్,వెంకటరావు, శివ,వాసుపల్లి బంగారమ్మ, సూరిబాబు,రామరాజు, చేపల రాజు, సాగర్,గుజరాపు రవి,రాము, జగన్, రమణమ్మ,సుధారెడ్డి, పోలవరపు ప్రసాద్ దంపతులు. మహేష్ తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?