పంట మార్పిడి విధానాలు" పైన లఘు చిత్రం విడుదల డాక్టర్ మణి భూషణ్. .. దర్శకత్వం లో

" విశాఖపట్నం : ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విద్యాలయం, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లాపరిషత్ సభా వేదిక పైన జరిగిన ఉత్తర కొస్తా మండల పరిశోధన మరియు విస్తరణ సలహా మండలి సమావేశములు, పరిశోధనా ప్రగతి, ఖరీఫ్ మరియు రబీ సమయంలో తీసుకోవలిసిన ప్రణాళికలు అధికారులు మరియు యూనివర్సిటీ నిపుణులు పాల్గొన్న రైతులకు అందరకి అవగహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మారుటేరు మరియు వ్యవసాయ పరిశోధన స్థానం, విజయనగరం వారి సమర్పణ లో " పంట మార్పిడి విధానాలు " పైన లఘు చిత్రాన్ని డాక్టర్ మణి భూషణ్ గారి దర్శకత్వం లో ప్రజలకు వరి పంట తరువాత ఏవిధమైన పంటలు వెయ్యాలి, అత్యధిక దిగుబడి సాధించే పంట రకాలను ఈ చిత్రం ద్వారా రైతులకు చైతన్యం తెచ్చే చిత్రమని అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా విడుదల చేసారు.

పంట మార్పిడి విధానాలు" పైన లఘు చిత్రం విడుదల   డాక్టర్ మణి భూషణ్. .. దర్శకత్వం లో

ఈ సందర్బంగా డాక్టర్ మణి భూషణ్ ఈ చిత్రం గూర్చి మాట్లాడుతూ పంట మార్పిడి విధానాలు అవలంభించడం వల్ల, రైతులు మొక్క జొన్న, కాయగూరలు, ఉలవలు వంటి పంటల పండించ వచ్చు. ఈ లఘు చిత్రం ద్వారా రైతుల విజయగాధ చూపించడం జరిగింది అని తెలిపారు, వ్యవసాయం ఒక్కటే రాబోయే రోజుల్లో అత్యధిక ఉపాధి పొందే రంగం అవుతుందని, యువత విప్లవాత్మక మార్పుకు స్వాగతం పలికి, వ్యవసాయం లో శిక్షణ పొందాలని పిలుపునిచ్చారు. శ్రీ కె తేజశ్వర రావు గారు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో ఎడిటర్ నీరజ, అనుబంధిత వ్యవసాయ సభ్యులు హాజరయ్యారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow