పల్లా శ్రీనివాసరావు ను రాష్ట్ర టిడిపి అధ్యక్ష పదవి నుంచి తొలగించాలి

పల్లా అనుచరుడు ప్రసాదులు చేసిన ఆరోపణలపై తన పైన పల్లా శ్రీనివాసరావు పైన సిబిఐ విచారణ చేయించాలి ఈనెల 29న ముఖ్యమంత్రి చంద్రబాబు రాక గాజువాక లో పరిస్థితి పై చంద్రబాబు ఒక గంట సమయం కేటాయిస్తే వాస్తవాలు తెలుస్తాయి --- తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ డిమాండ్ విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ సంస్కృతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పల్లా శ్రీనివాస రావును తక్షణమే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని.. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం డాబా గార్డెన్స్ లోని వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తన పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అనుచితంగా ప్రవర్తించారని.. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో మాట్లాడనని అన్నారు. ఈ క్రమంలోనే పల్లా శ్రీనివాసరావు అనుచరుడు ప్రసాదుల ఒక ప్రకటన విడుదల చేస్తూ.. బి.వి.రామ్ ఒక లుచ్చా, బ్లాక్ మైలర్, తెలుగు శక్తికి అధ్యక్షుడు కాదు తెలుగు బ్రోకర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. "నా మనోభావాలు దెబ్బతిని ఆవేదనను వ్యక్తం చేస్తే పల్లా అనుచరుడికి వచ్చిన నొప్పి ఏంట

పల్లా శ్రీనివాసరావు ను రాష్ట్ర టిడిపి అధ్యక్ష పదవి నుంచి తొలగించాలి

పల్లా శ్రీనివాసరావు చెప్పిన మీదటే ప్రసాదుల తన గౌరవానికి భంగం కలిగిస్తూ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. పల్లా అనుచరుడు చేసిన ఆరోపణలు నిజమో కాదో తెలియాలంటే.. తన పైన పల్లా శ్రీనివాసరావు పైన సిబిఐ చేత విచారణకు డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు అక్రమాలకు పాల్పడుతున్నారని.. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ గాజువాక జంక్షన్ లో పల్లా శ్రీనివాసరావు సమీప బంధువు కు చెందిన ఒక భారీ భవన నిర్మాణానికి అనుమతులు లేకపోయినప్పటికీ నిర్మాణ పనులు చకచగా కొనసాగుతున్నాయన్నారు. 

ఈ నెల 29వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం వస్తున్నారని .. ఒక గంట పాటు సమయం కేటాయిస్తే గాజువాక లో పల్లా శ్రీనివాసరావు కొనసాగిస్తున్న అరాచకాలను ప్రజలే తెలియజేస్తారన్నారు. పల్లా శ్రీనివాసరావు ఇటీవల తన పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని వాటిని చంద్రబాబు నాయుడు సమక్షంలోనే బయట పెడతానని బి.వి.రామ్ ప్రకటించారు.

 *గాజువాక పోలీస్ స్టేషన్లో పల్లా శ్రీనివాస్ పై తెలుగు శక్తి ఫిర్యాదు* 

ఈ క్రమంలోనే గాజువాక పోలీస్ స్టేషన్ లో తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ తన గౌరవానికి విఘతాం కలిగించారని ఫిర్యాదు చేశారు. పల్లా శ్రీనివాసరావును ఏ 1, ప్రసాదుల శ్రీనివాస ను ఏ 2 నిందితులుగా చేర్చాలని ఆ ఫిర్యాదులో పేర్కొనని బి.వి.రామ్ తెలిపారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow