Naga Chaitanya Sobhita Divorce Agreement: నాగ చైతన్య, శోభితల విడాకుల అగ్రిమెంట్.. బయటకొచ్చిన అక్కినేని ఫ్యామిలీ సీక్రెట్స్!?
పెళ్లి సమయంలో నాగ చైతన్య, శోభితల మధ్య విడాకుల అగ్రిమెంట్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది.. వివరాల్లోకి వెళ్తే..
నాగచైతన్య శోభితల పెళ్లి ఈ నెల 4వ తేదీన గ్రాండ్ గా జరగగా చైతన్య పెళ్లి వార్త అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని నాగచైతన్య తండేల్ సినిమాతో రాబోతున్నారు.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను కచ్చితంగా సొంతం చేసుకుంటారని 2025 సంవత్సరం అక్కినేని హీరోలకు స్పెషల్ ఇయర్ కావడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
తండేల్ మూవీ ఏకంగా 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిందని తెలుస్తోంది. అయితే చైతన్య శోభిత గురించి ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
చైతన్య శోభిత పెళ్లి సమయంలో నాగార్జున వీళ్లిద్దరి మధ్య విడాకులకు సంబంధించి ఒక అగ్రిమెంట్ ను సిద్ధం చేయించి వాళ్లతో సంతకాలు చేయించారని ప్రచారం జరుగుతోంది. ఆ అగ్రిమెంట్ లో ఎన్నో షరతులు, నిబంధనలు ఉన్నాయని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.
అయితే వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. చైతన్య సమంత విడిపోయిన నేపథ్యంలో నాగార్జున చైతన్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అగ్రిమెంట్లకు సంబంధించి జరుగుతున్న ప్రచారం మాత్రం పూర్తిగా అవాస్తవం.
నాగార్జున ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కొంతమంది ఫేక్ వార్తలు సృష్టిస్తున్నారు. చైతన్య, శోభిత ఒకరినొకరు ప్రేమించుకొని నమ్మకంతో వివాహం చేసుకున్నారు.
చైతన్య శోభిత జోడీ చూడముచ్చటగా ఉందని వీళ్లిద్దరూ కలిసి నటిస్తే చూడాలని ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ కాంబోను సిల్వర్ స్క్రీన్ పై చూడాలంటే చైతన్య, శోభితలలో ఎవరో ఒకరు చొరవ తీసుకోవాల్సి ఉంటుంది.
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లు చైతన్య శోభితలతో ఒక ఫ్యామిలీ డ్రామా మూవీని ప్లాన్ చేస్తే బాగుంటుందని చెప్పవచ్చు. పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో చైతన్య నటించాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
What's Your Reaction?