జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించండి ఉచితంగా వైద్య పరీక్షలు చేయించండి డీఆర్‌వో భవానీ శంకర్‌కు జర్నలిస్టుల వినతి
విశాఖపట్నం, జూన్23: విశాఖ జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్‌కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల అధ్వర్యంలో డీఆర్‌వో భవానీ శంకర్‌కు వినతిపత్రం సమర్పించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డీఆర్‌వోను జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షుడు పి.నారాయణ్‌లు కలుసుకొని ఇప్పటికే ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలు అక్కడ జర్నలిస్టుల పిల్లలకు స్కూల్‌లో ఫీజు రాయితీపై ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని వివరించారు.
అలాగే వినతిపత్రంతో పాటు ఆయా జిల్లాలు జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులను డీఆర్‌వోకి అందజేశారు. అక్కడి మాదిరిగానే విశాఖ జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు వంద శాతం రాయితీ కల్పించాలని కోరారు. అలాగే జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కొన్ని స్కూల్స్ ఫీజు రాయితీ నిరాకరిస్తున్నాయని వీరు తెలియజేశారు.
What's Your Reaction?