పేదలు, అనాధలతో రాఖీ పండుగ ఎంతో ఆనందం

విశాఖ సిటీ: రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల్లో ఉన్న పేదలు, అనాధలకు అడ్వకేట్ చెన్నా ప్రమోధిని, చెన్నా ప్రణాళిక ఇరువురూ కలసి ఆత్మీయంగా రాఖీలను కట్టి వారికి చక్కటి స్వీట్స్, ఆహార పదార్థాలను అందించారు. ఈ సందర్భంగా లాయర్ చెన్నా ప్రమోధిని, చెన్నా ప్రణాళిక మాట్లాడుతూ.... రాఖీ పండుగను పేదలు, అనాదలతో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాఖీలు కడుతున్న సందర్భంలో కొందరు సోదరులులా అభిమానంతో దీవించారన్నారు.

పేదలు, అనాధలతో రాఖీ పండుగ ఎంతో ఆనందం

మనం సంపాదించిన దానిలో ఎంతో కొంత పేదలకు, అనాధలకు సేవా మార్గంలో అందించాలనే విషయాన్ని కుటుంబసభ్యుల ద్వారా చిన్నతనం నుంచి నేర్చుకున్నామని లాయర్ చెన్నా ప్రమోధిని, చెన్నా ప్రణాళిక తెలిపారు. ఎన్నో ఏళ్లుగా సమాజ సేవల్లో భాగంగా వివిధ సందర్భాల్లో కొందరు విద్యార్దులకు విద్యా సామాగ్రిను, ఆర్థిక సహాయంను, పేదలకు, మహిళలకు వస్త్రదానం, ఆహారం, ఆర్థిక సహాయంను చేస్తున్నామని వారు పేర్కొన్నారు. ఇంతకు మునుపు తమ తండ్రి డాక్టర్. చెన్నా గౌరీ శంకర్ ఇచ్చే పాకెట్ మనీతో పేదలకు సేవలు నిర్వహించేవారమని, ప్రస్తుతం అడ్వకేట్ గా తన సొంత సంపాదనతో పేదలకు వివిధ మార్గాల్లో సేవలను అందిస్తున్నానని లాయర్ చెన్నా ప్రమోధిని తెలిపారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow