ఎరుకుమాంబ దేవస్థానంలో ఘనంగా భీష్మ ఏకాదశి వేడుకలు.

విశాఖపట్నం ఫిబ్రవరి 6,దొండపర్తి లోని శ్రీ ఎరుకుమాంబ అమ్మవారి దేవస్థానంలో శనివారం భీష్మ ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జి. వి. రమాభాయి శనివారం ఉదయం శ్రీ అమ్మవారికి నారికేల అభిషేకాలు,విశేష పూజలు నిర్వహించి భీష్మ ఏకాదశి వేడుకలను జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో దేవస్థానంను సందర్శించి శ్రీ ఎరుకుమాంబ అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా దేవస్థానం ఆవరణలో హరిహర నామ సంకీర్తన ఏకాహ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భజన బృందాలుచే గీతాలాపనలు,సంకీర్తనలు జరిగాయని .

ఎరుకుమాంబ దేవస్థానంలో ఘనంగా భీష్మ ఏకాదశి వేడుకలు.

ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జి. వి. రమాభాయి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు జి.శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ పితాని సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow