పంచ తత్వాలు సహాయం తో యోగాంధ్ర విజయవంతము బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో ప్రత్యేక *శివ ప్రార్ధనలు *ప్రధాని మోదీ వల్లే ప్రపంచ దేశాలలో యోగా కు గుర్తింపు
డాబాగార్డెన్స్((.విశాఖపట్నం). జూన్ 20.. పరమశివుడు శక్తి, పంచ తత్వాల సహాయంతోనే యోగాంధ్ర 2025 పూర్తిగా విజయవంతం అవుతుందని ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వ విశ్వవిద్యాలయం ప్రతినిధులు బి కే రామేశ్వరి,శివలీల, సోమేశ్వరి లు ఆకాంక్షించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులకు ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించి అందరితో యోగా సాధకుడు సన్యాసి రావు ఆధ్వర్యంలో యోగా సనాలు నేర్పించారు.. ఈ సందర్భంగా తొలుత బ్రహ్మకుమారిస్ జర్నలిస్టులు సంయుక్తంగా విశాఖ లో చేపట్టిన యోగాంధ్ర పూర్తి గా విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వీరంతా పరమశివుడిని ప్రార్థించారు.
కార్యక్రమం లో బ్రహ్మకుమారిస్ ప్రతినిధులు రామేశ్వరి..శివలీల లు మాట్లాడుతూ పవిత్ర పుణ్య భారత దేశంలోనే యోగ పుట్టిందన్నారు. ఇతర దేశాల్లో ఎక్కువగా వెస్ట్రన్ నాగరికత కు ఇష్టం చూపిస్తారన్నారు..యోగ అంటే మూడు అర్థాలు ఉన్నాయని సంబంధము జోడించుట,కలయిక, ప్రాప్తిగా వీటిని చెప్పు కోవచ్చు అన్నారు. యోగం అనేది మతాలకు, కులాలకు,. ధర్మాలకు అతీతమైనదన్నారు. ప్రధాని మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోగాంధ్ర వైపు ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తుందన్నారు. అందుకు విశాఖ వేదిక కావడం ఇక్కడ ప్రజల అదృష్టంగా భావిస్తున్నారన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా జర్నలిస్టుల కోసం బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో క్రమం తప్ప కుండా
యోగ డే వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నా మన్నారు. అలాగే యోగాంధ్ర లో ఈ ఏడాది అందరమూ భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ దేశాల్లో యోగాకు గుర్తింపును తీసుకొచ్చింది ప్రధాని మోడీ కావడం అందరికి గర్వకారణం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన ఈ యోగాంధ్ర పండుగ తప్పకుండా విజయవంత ము అవుతుంది అని అన్ని రికార్డులు సాధిస్తుందని గంట్ల శ్రీనుబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. సీనియర్ పాత్రికేయులు. ఆర్ నాగరాజు పట్నాయక్, మౌంట్ అబూకు చెందిన దిల్ రెడ్డి లు మాట్లాడుతూ యోగా డే సందర్బంగా బ్రహ్మ కుమారీస్ జర్నలిస్ట్ లకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం, ఆసనాలు వేయించి యోగా పై మక్కువ పెంచడం అభినందనీయం అన్నారు.. ఈ కార్యక్రమం లో పలువురు జర్నలిస్ట్ లు, బ్రహ్మ కుమారీస్ పెద్ద ఎత్తున ప్రార్ధన లో పాల్గొని కొంత సేపు యోగసనాలు వేసి ఉల్లాసం గా గడిపారు... రామేశ్వరి ఆధ్వర్యంలో ప్రసాదం వితరణ జరిగింది..
What's Your Reaction?