బొత్స తో వాసుపల్లి భేటీ

ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ ను దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గురువారం ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు ఇరువురు పలు రాజకీయపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ వైయస్సార్సీపి మళ్లీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కార్యకర్తల్లో నాయకుల్లో నూతన ఉత్సాహం తీసుకు వస్తామన్నారు.

బొత్స తో వాసుపల్లి భేటీ

ఈ మేరకు జిల్లాలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకులకు కార్యకర్తలకు అనుబంధ సంఘాల పదవులు అందజేసి గుర్తింపు ఇచ్చామన్నారు. త్వరలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారన్నారు. 2027 జమిలీ ఎలక్షన్ లో వైఎస్ఆర్సిపి కి ప్రజలంతా పట్టం కడతారన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమాన్ని అభివృద్ధిని ఓటమి ప్రభుత్వం వెనక్కి నెట్టిందని, దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి అందించిన రామ రాజ్యాన్ని ప్రజలు కోరుకుంటున్నారని వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow