ఆంధ్ర వాయిస్ రిపోర్టర్ శ్రీలతకు ఘన సత్కారం పత్రికా సేవలకు గుర్తింపుగా శాలువా సత్కారం, జ్ఞాపిక అందజేత

విశాఖపట్నం, జూలై 27: పత్రికా రంగంలో విలక్షణమైన సేవలందిస్తూ, సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్న ఆంధ్ర వాయిస్ స్టాప్ రిపోర్టర్ శ్రీలతకు విశేషంగా ఘన సత్కారం చేయడం జరిగింది. విశాఖ నగరంలోని 41వ వార్డులో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వైఎస్సార్సీపీ నాయకుడు కోడిగుడ్ల శ్రీధర్ దంపతులు శ్రీలతను శాలువా కప్పి సన్మానించారు. అంతేగాక, ఆమె సేవలకు గుర్తింపుగా జ్ఞాపికను కూడా అందజేశారు. పత్రికా వృత్తిలో నిబద్ధతతో పనిచేస్తూ, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ఆమె పాత్ర ప్రశంసనీయం. అంతేగాక, పలు సామాజిక కార్యక్రమాల్లోనూ ఆమె చురుకైన పాత్ర పోషిస్తూ, అభివృద్ధి మార్గంలో పాదాన్ని మోపిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు హాజరై శ్రీలతను అభినందించారు. ఆమె విధేయత, పట్టుదల, ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధతను కొనియాడారు.

ఆంధ్ర వాయిస్ రిపోర్టర్ శ్రీలతకు ఘన సత్కారం పత్రికా సేవలకు గుర్తింపుగా శాలువా సత్కారం, జ్ఞాపిక అందజేత

ఈ తరహా సత్కారాలు పాత్రికేయ వృత్తిలో ఉన్నవారికి మరింత ప్రోత్సాహాన్నిస్తాయని వ్యాఖ్యానించారు.

పత్రికా రంగాన్ని సేవాపథంగా భావించి పనిచేస్తున్న శ్రీలతకు ఈ ఘన సత్కారం మరింత ఉత్తేజాన్ని కలిగిస్తుందని అందరూ అభిప్రాయపడ్డారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow