రాజకీయ రంగంలో కూడా రెల్లి కులస్తులకు రిజర్వేషన్ కల్పించాలి
విశాఖ సిటీ: ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు విద్య, ఉద్యోగ అంశాల్లో కల్పించిన ఒక శాతం రిజర్వేషన్ ను రాజకీయ రంగంలో కూడా వర్తింపజేయాలని సిఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బిజెపి నేతలను ప్రముఖ విద్యావేత్త, ఆంధ్ర ప్రదేశ్ రెల్లి కుల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్. చెన్నా గౌరీ శంకర్ కోరారు. విద్య, ఉద్యోగ రంగాల్లో రెల్లి కులస్తులు అభివృద్ధి సాధించినా... రాజకీయంగా ప్రాతినిధ్యం లేకపోతే అనుకున్న లక్ష్యాలను, అభివృద్ధిని సాదించలేరని,
అధికారులుగా చట్టాలను అమలు చేయడం, పౌరులుగా చట్టాలను పాటించడం మాత్రమే రెల్లి కులస్తులు ఇప్పటివరకూ.. చేస్తున్నారని, కానీ చట్టాలు చేసే అంశాల్లో ఎమ్మెల్యే, ఎంపి, మంత్రి, ఇలా ఉన్నత స్థానాల్లో రాజకీయంగా ఉంటేనే కొంతవరకైనా రెల్లి కులస్తులకు న్యాయం జరుగుతుందని డాక్టర్. చెన్నా గౌరీ శంకర్ పేర్కొన్నారు. రెల్లి కులస్తుల స్థితిగతులను, వెనుకబాటుకు ప్రభుత్వం మరింత అధ్యయనం చేసి రిజర్వేషన్ పెంచాలని ఈ సందర్భంగా కోరారు.
What's Your Reaction?