కురసాల సత్యనారాయణకు నివాళులర్పించిన వాసుపల్లి
మాజీమంత్రి కురసాల కన్నబాబు తండ్రి కురసాల సత్యనారాయణ ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. కాకినాడ స్వగృహంలో గురువారం జరిగిన పెద్ద కార్యం కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ హాజరై కురసాల కన్నబాబును పరామర్శించారు. ముందుగా ఆయన తండ్రి సత్యనారాయణ చిత్రపటానికి పుష్పాలు అర్పించి నివాళులర్పించారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబానికి
వాసుపల్లి గణేష్ కుమార్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వాసుపల్లి తో పాటు పలువురు వైసిపి సీనియర్ నాయకులు నివాళులర్పించారు.
What's Your Reaction?