శివాజీ పార్క్ గొడుగు వాకర్స్ యొక్క నూతన కార్యవర్గం
. ఈరోజు అనగా బుధవారం నాడు శివాజీ పార్క్ ఆవరణలో శివాజీ పార్క్ వాకర్స్ అసోసియేషన్ యొక్క సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2025-26 సంవత్సరం నకు నూతన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షునిగా శ్రీ కే శివరామకృష్ణ గారు, ఉపాధ్యక్షులుగా ప్రొఫెసర్ ఎన్ రామకృష్ణ గారు, కార్యదర్శిగా శ్రీ వి సత్యనారాయణ గారు, కోశాధికారిగా శ్రీ ఎం నంద కుమార్ గారు, జాలి వాకర్ గా శ్రీ అప్పల రాజు గారు
మరియు 9 మంది డైరెక్టర్లను ఎన్నుకోవడం జరిగింది. ఈ అసోసియేషన్ కి గౌరవ అధ్యక్షుడిగా ప్రొఫెసర్ వి ఎస్ ఆర్ కే ప్రసాద్ గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ కె శివరామకృష్ణ గారు మాట్లాడుతూ ఈ సంవత్సరం, గడిచిపోయిన సంవత్సరం కన్నా ఎక్కువ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని అందుకు అందరి సహకారాలు కావాలని తెలియజేశారు. ప్రొఫెసర్ వి ఎస్ ఆర్ కే ప్రసాద్ గారు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేయడంలో మన క్లబ్బు మిగతా క్లబ్బులకు ఆదర్శవంతంగా నిలవాలని హితువు పలికారు .
What's Your Reaction?