కూటమి ప్రభుత్వంలో యాదవులకు ప్రాధాన్యత తగ్గితే సహించేది లేదని యాదవ ఐక్య వేదిక జాతీయ అధ్యక్షులు అల్సి అప్పలనారాయణ యాదవ్ హెచ్చరించారు

. విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్లో జరిగిన విలేకరుల సమావేశంలో యాదవ ఐక్య వేదిక జాతీయ అధ్యక్షులు అల్సి అప్పలనారాయణ యాదవ్ మాట్లాడారు. మేయర్ అయిన గోలగాని వెంకట కుమారిని మారిస్తే కూటమి ప్రభుత్వంలో భాగస్వములైన జీవిఎంసి బిజేపి ఫ్లోర్ లీడర్, జనసేన యాదవ కార్పొరేటర్, రెండు సార్లు జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు తీసుకున్న యాదవ నాయకులకు ఏ ఒక్కరిని నియమించిన కూటమి ప్రభుత్వం కు సహకరిస్తామని అన్నారు. యాదవ నాయకులను కూటమి ప్రభుత్వం నియమించకపోతే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న యాదవులు అగ్రహానికి కూటమి ప్రభుత్వం తెలుగు దేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం కు తగులుతుంది అని అల్సి అప్పలనారాయణ హేచ్చరిక చేసారు.

కూటమి ప్రభుత్వంలో యాదవులకు ప్రాధాన్యత తగ్గితే సహించేది లేదని యాదవ ఐక్య వేదిక జాతీయ అధ్యక్షులు అల్సి అప్పలనారాయణ యాదవ్ హెచ్చరించారు

జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఉపాధ్యక్షులు కోడిబోయిన బాబ్జి యాదవ్ మాట్లాడుతూ యాదవ మేయర్ ని మారిస్తే ఇతర బిసి కులాలను మేయర్ అంటూ చేస్తే గ్రామ సంఘాల నుంచి జిల్లా సంఘం వరకు మోటివేషన్ చేసి ప్రజాప్రతినిధులు ఆయునటువంటి పల్లా శ్రీనివాస్, వంశీ కృష్ణ శ్రీనివాస్ ల ఇళ్లను ముట్టడించడానికి పిలుపునిస్తాం అన్నారు.

    ఈ కార్యక్రమం లో విశాఖ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల వేణు గోపాల్ యాదవ్ , వీదుల ప్రసాద్ యాదవ్ తదితర నాయకులు జరిపిన ప్రెస్ మీట్ లో యాదవ పెద్దలు, యాదవ ప్రముఖులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow