విద్యుత్తు మోతపై 27న వైసిపి పోరుబాటకు సిద్ధం కండి సమన్వయ కమిటీలో దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్

కరెంటు చార్జీల బాదుడుపై ఈనెల 27వ తేదీన అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు వైఎస్ఆర్సిపి పోరుబాటను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఆశీలమెట్ట కార్యాలయంలో మంగళవారం ఉదయం దక్షిణ వైసీపీ శ్రేణులు కార్యకర్తలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ముందుగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్కుమార్ మాట్లాడుతూ ప్రజలపై వేలకోట్ల రూపాయలు విద్యుత్ భారం మోపుతున్న కూటమి ప్రభుత్వంపై నిరసన గళం వినిపించాలన్నారు. అసలు కరెంటు చార్జీలు పెంచమన్న చంద్రబాబు వినియోగదారులే కరెంట్ అమ్మేలా చేస్తామని ప్రగల్బాలు పలికి అధికారంలోకి వచ్చాక పేద ప్రజలపై కరెంట్ చార్జీలు మోపడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు ఆరు నెలలు తిరగకుండానే ప్రజలపై బాదుడే బాదుడు తో నడ్డి విరుస్తున్న చంద్రబాబుకు ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని వాసుపల్లి హెచ్చరించారు .

విద్యుత్తు మోతపై 27న వైసిపి పోరుబాటకు సిద్ధం కండి     సమన్వయ కమిటీలో దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్

మన నియోజకవర్గంలో విద్యుత్ శాఖ అధికారుల కార్యాలయం వద్ద ప్రజల తరఫున ప్రజలతో కలిసి నిర్వహిస్తున్న భారీ ర్యాలీని విజయవంతం చేయాలన్నారు. అనంతరం అధికారులకు కరెంటు చార్జీలు తగ్గించాలని కోరుతూ వినతిపత్రం అందజేస్తామని వాసుపల్లి గణేష్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ, కార్పొరేటర్లు తోట పద్మావతి, చెన్నా జానకిరామ్,మాజీ కార్పొరేటర్ అమ్మాజీ.... వైసీపీ శ్రేణులు, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ సనపల భరత్, సకల భక్తుల ప్రసాద్,దక్షిణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముజీబ్ ఖాన్, వార్డ్ ప్రెసిడెంట్ పీతల వాసు, కనకరెడ్డి, దశమంతల మాణిక్యాల రావు ,బాపూఆనంద్,ముట్టబతుల రమేష్, కనకరెడ్డి, మసిపోగు రాజు,ముజీబ్ ఖాన్, ఎర్ణమ్మా గుడి చైర్మన్ లండ రమణ, లింగం శ్రీను,దశమంతలు చిన్ని,భాను,వసర్ల బుజ్జి,బోర శ్రీనివాస్ రెడ్డి, సాగర్, బేవార మహేష్,కోన శంకర్,తాడి రవి తేజ, కోరాడ సురేష్, బుల్లెట రవి, వాసుపల్లి రాజు,అక్బర్ పాల్గొన్నారు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow