తల్లి జ్ఞాపకార్థం కిరణ్ కుమార్ సేవలు
విశాఖ సిటీ : సీనియర్ జర్నలిస్టుఅండ్, కెమెరామెన్ గూడెం కిరణ్ కుమార్ తల్లి దివంగత ధనలక్ష్మి స్వర్గస్తులైన రోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు ఇందులో భాగంగా పలు ప్రాంతాలలో ఉన్న అభాగ్యులకు పేదలకు అనాధలకు ఆహార పదార్థాలను కొంత ఆర్థిక సహాయాన్ని అందించి కిరణ్ కుమార్ తన గొప్ప మనస్సును చాటుకున్నారు ఈ సందర్భంగా గూడెం కిరణ్ కుమార్ మాట్లాడుతూ తన చిన్నప్పటి నుంచి తన తల్లి తండ్రి వివిధ సందర్భాలలో పర్వదినాలలో అనాధలకు పేదలకు ఆహార పదార్థాలతో పాటు ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని అందించేదని
వాటిని చిన్నతనం నుంచి చూసి తనకు కూడా ఈ సేవలు అలవాటైందని పేర్కొన్నారు. విశాఖ రైల్వే స్టేషన్ అల్లిపురం కంచరపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ తదితర ప్రాంతాలలో కిరణ్ కుమార్ తన సేవలను నిర్వహించారు ఈ సందర్భంగా సేవలను అందుకున్న పేదలు స్పందిస్తూ కిరణ్ కుమార్ సేవలకు సంతోషించారు.
What's Your Reaction?