మీలో... నేను " లైఫ్ ఫిలిం టాక్ షో వెబ్ సిరీస్ ప్రారంభం డాక్టర్ మణి భూషణ్ దర్శకత్వం లో
నగరానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ వారి నిర్వహణలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వెబ్ ఛానల్ టీవీ టూరిజం వారి నిర్వహణలో ప్రముఖ దర్శకుడు జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ మణి భూషణ్ గారి స్వీయ రచన దర్శకత్వం లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మీలో నేను అనే వెబ్ సిరీస్ గత ఆరేళ్లుగా ఎన్నో ఎపిసోడ్స్ రిలీజ్ చేసి ఎంతోమంది మహానుభావుల జీవితాల నుండి స్ఫూర్తిని వెలికితీసి అందరికి పరిచయం చేసింది . ఇప్పుడు సరిక్రొత్తగా సీజన్ 2 ద్వారా మరికొంతమంది మానవతా మూర్తుల జీవితాలని స్ఫూర్తినింపే కధనం తో వారి జీవిత విశేషాలను , సేవలను ,
ఇలాంటివారు మనలోనే ఉన్నారా అని అనిపించే వారి బృహత్తర కార్యక్రమాల సేవామాలలు ఏరికూర్చి మీకు అందించే ప్రయత్నం లో భాగంగా ఈ రోజు పార్వతిపురం లో ఉన్న ప్రముఖ సంఘ సేవకుడు శ్రీ సంక గౌరిశంకర్ నారాయణ్ మరియు శ్రీమతి భూదేవి గారి సేవ జీవనప్రయాణం తో మీలో నేను మొదటి భాగం అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యిందని , వారి స్వగృహం లో అతిధుల మధ్య అద్భుతంగా షూటింగ్ పూర్తి అయ్యిందని, ఈ కార్యక్రమం లో శ్రీ వేంకేటేశ్వర స్వామి సేవకుడు శ్రీరామచంద్ర మూర్తి మరియు కళింగ వైశ్య సంఘము ప్రెసిడెంట్ బరటం వెంకటరమణ గారు సమక్షం లో డాక్టర్ మణి భూషణ్ సేవలను కొనియాడుతూ , సమాజాన్ని ప్రభావితం చేసే చిత్రాల దార్శనికుడు డాక్టర్ మణి భూషణ్ గారు అని స్లాఘిస్తూ, విశేషంగా వారి సేవలను , కీర్తిని తెలియపరుస్తూ, దుశ్శాలువా మరియు శ్రీవారి పుస్తకాలూ ,క్యాలెండరు ను బహూకరించి ఆత్మీయ సత్కారం చేసి గౌరవించారు, ఈ సందర్బంగా డాక్టర్ మణి భూషణ్ మాట్లాడుతూ ...మీలో నేను అనే వెబ్ సిరీస్ ద్వారా సుమారు 18 మంది స్ఫూర్తి ప్రదాతలు జీవన శైలి ప్రపంచానికి దృశ్య కావ్యం లా చూపించమని, సీజన్ 1 అందరి మన్ననలు పొంది ప్రేక్షకులనుండి విపరీత స్పందన వచ్చిందని , అదే స్ఫూర్తి తో మరికొంతమంది సేవ జీవితాలు మరియు స్ఫూర్తి నింపే వారి కార్యకలాపాలను రాబోయే తరం గుర్తు చేసుకొని ముందు అడుగు వేసేలా, ప్రేరణ కలిగించే చైతన్యం తీసుకు వచ్చేందుకు మల్లి మీలో నేను సీజన్ 2 ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని , ఈ సీజన్ కూడా మిమ్మల్ని అలరిస్తుందని మీ అందరికి ఒక నూతన ఉత్తేజం కలిగించేలా తీర్చి దిద్దుతున్నామని, మీ అందరి ఆశీస్సులతో ఈ ఉగాదికి టీవీ టూరిజం లో విడుదలకు సిద్ధం చేస్తున్నామని , గత 26 సవత్సరాలుగా ప్రతి చిత్రాన్ని అవార్డులు రివార్డులు అందుకునేలా ఎంతో ఆదరణ చూపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేసారు , ఈ టీవీ షో లో సమాజం కోసం జీవితాన్ని పణంగా పెట్టి సేవజేసే ఎవ్వరైనా పాల్గొనవచ్చని తెలిపారు మరిన్ని వివరాలను 9848418582 ద్వార పొందవచ్చు అని , ఈ సదవకాశం ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో సీఈఓ సీత రామ స్వామి , ఎడిటర్ నీరజ , హీరో నిర్మాత ఆదిత్యభూషణ్ హాజరై ఈ సీజన్ 2 ప్రారంభం విజయవంతం చేసారు.
What's Your Reaction?