డా॥బి.ఆర్.అంబేద్కర్‌ను అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రాజీనామాచేయాలి
విశాఖలో వామపక్షపార్టీలు నిరసన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్‌పై పార్లమెంట్ వేధికలో కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌షా అవమానకర వ్యాఖ్యలు చేయడాన్ని వామపక్షపార్టీలు తీవ్రంగా ఖండిరచాయి. అమిత్‌షా తక్షణమే రాజీనామా చేయాలని సిపిఐ కేంద్ర కంట్రోల్ కమీషన్ సభ్యులు ఎ.జె.స్టాలిన్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడులు డిమాండ్ చేసారు. అమిత్‌షా వ్యాఖ్యలను నిరశిస్తూ దేశవ్యాప్తంగా వామపక్షపార్టీలు నిరసనలకు పిలుపునివ్వడంతో విశాఖ జిల్లా డాబాగార్డెన్స్‌లో ఉన్న డ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. అమిత్‌షా దిష్టిబొమ్మను పెట్టరాదని పోలీసులు వాగ్వావాదానికి దిగడంతో వామపక్ష కార్యకర్తలు దిష్టిబొమ్మను ముక్కలు ముక్కలు చేసారు. పోలీసులు, వామపక్షపార్టీల కార్యకర్తల మధ్య తోపులాటజరగడంతో కార్యకర్తలకు చిన్న చిన్న గాయాలయ్యాయి. ఈ సంద్భంగా నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్‌షాను సమర్ధించిన దేశ ప్రధాని నరేంద్రమోడీని పోలీస్‌లు కేసులు బనాయించకుండా వామపక్షపార్టీల కార్యకర్తలపై విరుచుకుపడటం సరైందికాదన్నారు.ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర
కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.మణి, సిపిఐఎంల్ నూడెమెక్రసీ నాయకులు వై.కొండయ్య, ఎస్.యు.సి.ఐ.సి రాష్ట్రనాయకులు గోవిందరాజులు, సిపిఐఎంఎల్ ప్రజాపోరు దేవా, వామపక్షనాయకులు వి.కృష్ణారావు, పి.చంద్రశేఖర్, ఎం.సుబ్బారావు, ఎం.వెంకటేశ్వర్లు, వై.రాజు, ఎం.లక్ష్మి, పి.వెంకటరావు, కె.కుమారి, తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?