వైసిపి దక్షణ ముస్లిం నేతకు అండగా "వాసుపల్లి" క్యాన్సర్ మందుల ఖర్చులకు రూ.10,000 సాయం.
-lఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే, దక్షిణ వైసిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) నిలిచిపోయిన తరుణంలో ఓ పేద ముస్లిం కుటుంబానికి దక్షణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైద్య ఖర్చులకు రూ. *10,000* లు ఆర్థిక సహాయం అందజేసి ఆపద్బాంధవుడిగా నిలిచారు. శనివారం ఉదయం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న దక్షిణ నియోజకవర్గ 36వ వార్డు గుడారి గోతుల ప్రాంతానికి చెందిన వైసిపి ముస్లిం నాయకుడు మహమ్మద్ జకీమ్ (50) పేషెంట్ ఇంటికి వెళ్లి పరామర్శించి వాసుపల్లి సొంత నిధులుతో రూ.,*10,000* నగదు అందజేశారు.
నిత్యం ప్రజా సేవలో ఉండే వాసుపల్లి వారి ప్రాంతానికి వచ్చి సాయం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ వాసుపల్లికి స్థానిక ముస్లిం నాయకులు శాలువ కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా దక్షిణ వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఎంతో పగడ్బందీగా పేదలకు కార్పొరేట్ వైద్యం అందించిన ఆరోగ్యశ్రీని నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ నిలిపివేయడంతో పేద ప్రజలు అంటే చంద్రబాబుకి ఎంత కపట ప్రేమో తేటతెల్లమైందన్నారు. ఆరోగ్యశ్రీ లో ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులకు ఉన్న మూడువేల కోట్ల బకాయిలు చెల్లించాలని వారు సమ్మె చేస్తుండటం తెలిసిందే. కానీ కేవలం 500 కోట్లు ఇస్తామని చేతులు దులుపుకోవడం చంద్రబాబు ప్రభుత్వానికి సమంజసం కాదని హెచ్చరించారు. నెట్వర్క్ ఆసుపత్రులకు మూడు వేల కోట్ల బకాయిల్లో కనీసం 1500 కోట్లు చెల్లించి ఆరోగ్యశ్రీని కొనసాగించాలన్నారు. బకాయిలు చెల్లించకపోతే జనవరి 25వ తేదీ నుండి పూర్తిగా ఆరోగ్యశ్రీలు నిలిపివేస్తామని నెట్వర్క్ ఆసుపత్రిలో హెచ్చరిస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వానికి కనీసం చలనం లేకపోవడం దుర్మార్గమన్నారు. జగన్ హయంలో ఆరోగ్యశ్రీ పథకం ఎంతో పగడ్బందీగా అమలు చేశారని గుర్తు చేశారు. అలాగే ఆరోగ్యశ్రీలో వ్యాధుల సంఖ్య గణనీయంగా పెంచి పేదలకు జగనన్న ఆరోగ్యశ్రీ నీ మరింత చేరువ చేశారని వెల్లడించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలల్లో పేదలను ఏడిపించడమే పనిగా పెట్టుకుందని, పేదల ఉసురు తగిలితే పాతాళానికి పోతారని వాసుపల్లి గణేష్ కుమార్ మండిపడ్డారు. దక్షిణ నియోజకవర్గ ప్రజలకు తన సేవా కార్యక్రమంలో భాగంగా అండగా అంటూ ఆదుకుంటానని వాసుపల్లి స్పష్టం చేశారు. కార్యక్రమంలో
సౌత్ ముస్లిం సెల్ ప్రెసిడెంట్ ముజీబ్ ఖాన్, మాజీ టెంపుల్ చైర్మన్లు కొండేటి సుధాకర్, లండా రమణ,సాగర్,వార్డ్ అధ్యక్షులు ముత్తాబత్తుల రమేష్, బేశెట్టి ప్రసాద్, మహమ్మద్ షకీల్ , నాజిమ్ , లియాకట్ , అనీస్ , ఖాసీం , అలీ , అజీజ్ల్లా, రఫి,ఆకుల శ్యాం,గిడిజాల ఉమా మహేశ్వర రావు,పెనగంటి సూర్య, అజయ్, చేపల రాజు, చింతకాయల వాసు, గనగాల రామరాజు మరియు తదితరులు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.
What's Your Reaction?