ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘం సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బొంది కాశీ విశ్వనాథం నియామకం

అనకాపల్లి, జూన్ 30: ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘం సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి బొంది కాశీ విశ్వనాథాన్ని నియమించారు. అనకాపల్లి పట్టణంలోని విజయ రెసిడెన్సీ హోటల్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి సమాఖ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు నడికుదుటి అర్జున్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల ముత్యాలు అధ్యక్షత వహించారు. సంఘం నిబంధనల ప్రకారం నిర్వహించిన సంప్రదింపుల అనంతరం బొంది కాశీ విశ్వనాథం నియామకాన్ని ఏకగ్రీవంగా ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘం సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బొంది కాశీ విశ్వనాథం నియామకం

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నడికుదుటి అర్జున్ రావు, ప్రధాన కార్యదర్శి చింతకాయల ముత్యాలు మాట్లాడుతూ, మత్స్యకారుల మధ్య ఐక్యతను బలోపేతం చేయడం, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు మత్స్యకారుల వరకు చేరేలా చర్యలు తీసుకోవడం, సంఘ నిబంధనలకు కట్టుబడి నూతన ఉపాధ్యక్షుడు కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నేతలు మల్లేటి రాంబాబు, సాయి బలరాం, రమణ, చేపల మసేను, చోడిపల్లి దేముడు, చింతకాయల అమ్మోరు, ఆది బాబు, జిల్లా అధ్యక్షులు గురునాథ్ రావు, ఒలిశేట్టి అప్పలరాజు, వివిధ మత్స్యకార సంక్షేమ సంఘాల ప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow