*సమాచార శాఖ మంత్రి దృష్టికి జర్నలిస్టుల సమస్యలు** *సానుకూలంగా స్పందించిన మంత్రి పార్ధ సారధి* *త్వరలో ప్రమాద భీమా పునరుద్దరణ* *ఇళ్ల కేటాయింపుల పై ముఖ్య మంత్రి సానుకూలత
* .... విశాఖపట్నం జూన్ 28. రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ శనివారం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్థసారధి దృష్టికి తీసుకువెళ్లింది జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు నాయకత్వంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖపట్నం జిల్లా అధ్యక్ష, కార్య దర్శులు పి.నారాయణ్, జి.శ్రీనివాస్, ఏపీబ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇరోతి ఈశ్వరరావు, మదన్ లు మంత్రి శ్రీ పార్థసారథి కలిసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు ముఖ్యంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు త్వరలో మంజూరు చేస్తామని ఇందుకు సంబంధించి 50శాతం ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.జర్నలిస్టులకు పింఛన్లు విషయమై ముఖ్యమంత్రిశ్రీ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి తగు నిర్ణయం తీసుకొంటామని పేర్కొన్నారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేదా ఇల్లు కేటాయించే విషయమై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని త్వరలో ఇందుకు సంభందించి కార్యాచరణ రూపొందిస్తామని హామీ ఇచ్చారు.ప్రమాద భీమా త
జర్నలిస్టులకు త్వరలో అక్రిడేషన్లు మంజూరు చేస్తామని డిజిటల్ మీడియాకు అక్క్రిడేషన్లుఇచ్చే విషయమై ప్రభుత్వం నియమ నిబంధనలు పాటించక తప్పదన్నారు అయితే అందరికీ న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నగేష్ బాబు, టి. పి. నాయుడు తదితరులు పాల్గొన్నారు
What's Your Reaction?