సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడి కుటుంబానికి మత్స్యకార సంక్షేమ సంఘాల సమాఖ్య మద్దతు

అనకాపల్లి, జులై 7 : చౌడిపల్లి ఎర్రయ్య ఇటీవల చేపల వేట చేస్తుండగా సముద్రంలో గల్లంతయిన సంఘటనపై తీవ్రంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు నడకుడి అర్జున్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల ముత్యాలు, రాష్ట్ర వైస్ చైర్మన్ మాతా గురునాథ్ (విశాఖ జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షుడు), రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంది కాశీ విశ్వనాథం, జిల్లా అధ్యక్షుడు చౌడిపల్లి దేవుడి, జిల్లా ప్రధాన కార్యదర్శి వలిశెట్టి అప్పలరాజు తదితరులు బాధిత కుటుంబాన్ని సాంత్వనపరిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక రాజకీయ పక్షాల ప్రముఖులు పాల్గొని మత్స్యకార కుటుంబానికి మద్దతుగా నిలవాలని కోరారు. మత్స్యకారుడి మృతికి సంబంధించి త్రీ మ్యాన్ కమిటీ (రెవెన్యూ, మత్స్య, పోలీస్ శాఖల) నివేదికను తక్షణమే సమర్పించాలని అధికారులను డిమాండ్ చేశారు.

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడి కుటుంబానికి మత్స్యకార సంక్షేమ సంఘాల సమాఖ్య మద్దతు

ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వ ఎక్స్‌గ్రేషియా సహా ఇతర నష్టపరిహారాలను తక్షణమే మంజూరు చేయాలని సమాఖ్య తరఫున రాష్ట్ర మంత్రులు కొల్లి రవీంద్ర, వంగలపూడి అనిత, కింజారపు అచ్చంనాయుడు, కలెక్టర్ మొదలైన అధికారులను కోరారు.

ఇంతలో రాష్ట్రంలోని ప్రతి మత్స్యకారుడు ఈ బాధిత కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని, మానవతా దృక్పథంతో స్పందించాలని మత్స్యకార సంఘాల సమాఖ్య పిలుపునిచ్చింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow