వేదాంతి ఇనిస్టిట్యూట్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో
ఈ పత్రికా సమావేశం వేదాంతి ఇనిస్టిట్యూట్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో డిసెంబర్ నెల 18 వ తేదీ నుండి 22వ తేదీ వరకు ప్రతి రోజు సాయంకాలం 6.30 నిముషాల నుంచి 7.45 గంటల వరకు ఆంధ్రయూనివర్సిటీ లోని డా: వై వి.ఎస్ మూర్తి ఆడిటోరియంలో భగవద్గీత లోని 10వ అధ్యాయం అయిన యోగా ఆఫ్ సుప్రీమ్ మ్యానిఫెస్టేషన్ (వుభూతి యోగం) మీద ఇంగ్లీషులో జరుగు ప్రవచనాల గురించి తెలియ పరుచుటకు, మిత్రులను పాల్గొనాల్సిందిగా కోరుటకును ఎర్పాటు చేయడమైనది.
భగవద్గీత లోని 10వ అధ్యాయం అయిన "వుభూతి యోగం' లో 42 శ్లోకాలు ఉన్నవి. ఈ అధ్యాయం ఆత్మయే ఈ సృష్టికి, ప్రపంచానికి మూలం అని వివరించింది. ఎంతో పరిణితి చెందిన జ్ఞానులకు కుడా ఆత్మ యొక్క మూలాలు తెలియవు. అయినా కుడా జ్ఞానులు అత్యంత భక్తి శ్రద్ధలతో, దృఢసంకల్పంతో ఆత్మసాక్షరతే లక్ష్యంగా, ఆత్మ సాక్షరత సాదించే వరకు సాధన చేస్తూంటారు ఈ అధ్యాయంలో విశ్వమంతా తాను ఎలా విస్తరించి ఉన్నడో విశ్లేషణాత్మకంగా వివరిస్తాడు. చివరలో శ్రీక్రిష్ణుడు ఈ విశ్వమంతా ఆత్మలో అణు మత్రమేనని అర్జునుడికి ప్రభోదిస్తాడు.
ఈ ప్రవచనాలు ధార్మిక జీవితం గురించి తెలుసుకొవటానికి ఒక చక్కని మార్గం. గత తొమ్మిది సంవత్సరాలుగా వేదాంత ఇనిస్టిట్యూట్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్టు జ్ఞానయజ్ఞం నిర్వహిస్తోంది. అందులొ భాగంగా ఈ సంవత్సరం స్వామి పార్ధసారథి గారి శిష్యురాలైన సుశీలాజీ భగవద్గీత లోని 10 వ అధ్యాయం అయిన "విభూతి యోగం " మీద ఇంగ్లీషులో ప్రవచనాలు చెప్పెదరు.
సుశీలాజీ గత మూడు దశాబ్ధాలుగా ప్రాచీనకాల వేదాంత శాస్త్రాన్ని అభ్యసిస్తు ఎన్నో పరిశోధనలు చేస్తూ, దాన్ని ప్రచారం చేయటంలో పూర్తి జీవితాన్ని గడుపుతున్నారు. ఆవిడ ప్రవచనాలు ప్రస్థుత పరిస్థితులకు అన్వయించి చెప్పే తీరు ప్రపంచమంతా పేరు ప్రఖ్యాతులు పొందాయి. వేదాంతాను దైనందిన జీవితంలో ఉపయోగించటం గురించి ప్రపంచ వ్యాప్తంగా వివిధ విద్యా సంస్థలలోను, కొర్పొరేటు సంస్థలలోను అనేక ఉపన్యాసములు ఇచ్చారు.
వేదాంత ఇనిస్టిట్యూట్ విశాఖపట్నం ట్రస్ట్ వైజాగు లోని వివిధ ప్రాంతలలో శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. ప్రతి విద్యార్థి శాస్త్రీయ, విశ్లేషనాత్మక ధోరణిలో శిక్షణ పొందే విధంగా వేదాంత ఫిలాసాఫి నిజజీవితానికి అన్వయిచుకోవటం కోసం విద్యార్ధుల మధ్య చర్చలు జరుపుతుంటారు. మీ దగ్గర అకాడమీ నందు వేదాంత ఫిలాసాపి మూడు సంవత్సరముల ఈ- లర్నింగ్ కోర్సు కుడా ఉన్నది.
What's Your Reaction?