దాతల సహకారంతోనే నిరుపేదల జీవితాల్లో వెలుగులు మనసు అనాధాశ్రమానికి నిత్యవసర వస్తువులు అందించిన గంట్ల

సింహాచలం.. జూన్ 20 దాతల సహకారంతోనే సమాజంలో పేదరికం తగ్గుతుందని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, నేవల్ డాక్ యార్డ్ కేటీబి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు. గంట్ల శ్రీనుబాబు ఆకాంక్షించారు. శుక్రవారం ఇక్కడ సింహాచలం రోడ్ లో ఉన్న మనసు అనాధాశ్రమానికి గంట్ల శ్రీను బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ పిల్లలకు అవసరమైన నిత్యవసర వస్తువులను అందజేశారు.

దాతల సహకారంతోనే నిరుపేదల జీవితాల్లో వెలుగులు  మనసు అనాధాశ్రమానికి  నిత్యవసర వస్తువులు అందించిన గంట్ల

ఈ సందర్బంగా గంట్ల శ్రీను బాబు మాట్లాడుతూ ఏడాదిలో రెండు మూడు పర్యాయాలు ఇక్కడ పిల్లలకి అవసరమైన సామాగ్రిని తన పరిధి మీద అందజేస్తూ వస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా మరికొంత సామగ్రిని అందజేయనున్నట్లు తెలియచేసారు.. ఈ ఆశ్రమంలో సుమారు 32 మంది పిల్లలుఉండగా వారంతా పలు పాఠశాలలు, కళాశాలల్లో ఉన్నత విద్యాభ్యాసం సాగిస్తున్నారని అందుకు సహాయం చేసిన దాతలు, కృషి చేసిన నిర్వాహకులు ప్రవీణ్ పార్వతిలను గట్ల శ్రీనుబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో సింహగిరి గ్యాస్ ఏజెన్సీ యజమాని గంట్ల కిరణ్ బాబు. మారుతి కన్వెన్షన్స్ యజమాని టి సుధీర్, గంట్ల ఎరుకుల మ్మ, సత్యవతి, శివాజీ, హర్ష వర్ధన్, హనీష, పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow