దక్షిణంలో ఘనంగా జగనన్న జన్మదిన వేడుకలు పలు సేవా కార్యక్రమాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి
పేద ప్రజల గుండెచప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. వార్డుల వారీగా జరిగిన వైయస్. జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల కేక్ కటింగ్ కార్యక్రమానికి మాజీ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై వేడుకలు ప్రారంభించారు ఆయనతోపాటు రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ పాల్గొని పేదలకు వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు. అలాగే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 33వ వార్డ్ అల్లిపురంలో వైసిపి వార్డు అధ్యక్షుడు ముత్తా బత్తుల రమేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు. 35వ వార్డులో వార్డు అధ్యక్షుడు కనకారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది. అలాగే 29 వ వార్డులో వార్డు అధ్యక్షుడు పీతల వాసు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు.అనంతరం పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. 37 వార్డులో కార్పొరేటర్ జానకిరామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగనన్న జన్మదిన వేడుకలకు వాసుపల్లి హాజరై వృద్ధులకు పండ్లు చీరలు అందజేశారు. అనంతరం. ఆశలు మెట్ట కార్యాలయంలో దక్షిణ వైసీపీ శ్రేణులు కార్పొరేటర్లతో
అధికారంలో కూర్చున్న కూటమి ప్రభుత్వం నమ్మి ఓటు వేసిన పేద ప్రజలకు నిలువుల ముంచిందని వాసుపల్లి గణేష్ కుమార్ విమర్శించారు. ప్రజలు కోరుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి మబ్బుల వీడిన సూర్యుడిలా పేద ప్రజలకు మళ్ళీ అధికారంలోకి వచ్చి వెలుగునిస్తారని వాసుపల్లి గణేష్ కుమార్, థీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ వైఎస్ఆర్సిపి నాయకులు దశమంతుల మాణిక్యాలు, మైకిల్ రాజు, బేశెట్టి ప్రసాద్,డేవిడ్ రాజ్, వేణుగోపాల్,బాలు,లింగం శ్రీను,చైర్మన్ లండ రమణ, వడ్డాది దిలీప్, వైట్, ముజీబ్ ఖాన్,కోన శంకర్,మాజీ డైరెక్టర్ సనపల భారత్ ,మాజీ డైరెక్టర్ ప్రసాద్,తాడి రవి తేజ, భేవర మహేష్,వాసుపల్లి భారతి,ఆకుల శ్యామ్,కోరాడ సురేష్,డైవ కుమార్,కార్యకర్తలు, మహిళా నాయకులు, స్థానికులు పాల్గొన్నా
What's Your Reaction?