జగన్ అడుగువేస్తే! అదే జనం.. అదే ఆప్యాయత * కూటమి నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిన మాజీ సీఎం పర్యటన.. * తరలి వెళ్లిన దక్షిణ వైసీపీ శ్రేణులు * కేజీహెచ్ లో జన సునామి విశాఖ జగనన్న పర్యటన సక్సెస్ మీట్ లో వాసుపల్లి
విశాఖలో జననేత జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జననీరాజనాలు అందుకోవడం కూటమి నేతల గుండెల్లో గుబులు పుట్టాయని మాజీ ఎమ్మెల్యే, దక్షణ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. దక్షిణ వైఎస్ఆర్సిపి శ్రేణులతో కలిసి ఆశీలమెట్ట కార్యాలయంలో శుక్రవారం జగన్ విశాఖ పర్యటన సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో దక్షిణ వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలి రావడం పట్ల ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అడుగడుగునా అదే ఆప్యాయత కనిపించడం జగనన్న విశాఖ పర్యటన మరింత ఆసక్తి రేకెత్తించిందన్నారు. జననీరాజనాలు చూసిన కూటమి నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తయన్నారు. అడ్డంకులు సృష్టించిన జన సునామీని ఆపలేకపోయారన్నారు. ఎండకు, వర్షానికి బెదరకుండా జగనన్నను చూసేందుకు ఎగబడిన ప్రజల ఆదరణ వైయస్సార్సీపీ శ్రేణులలో రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. కేజీహెచ్ పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న గిరిజన బాలికలను పరామర్శించేందుకు వచ్చిన మాజీ సీఎం జగనన్నను చూసేందుకు ఆ ప్రాంతమంతా జనసంద్రోహంతో నిండిపోయిందన్నారు.
దక్షిణలో అన్ని వార్డుల నుండి వైసీపీ శ్రేణులతో పాటు జనసంద్రోహం కదిలి వచ్చిందనీ వాసుపల్లి గణేష్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సక్సెస్ మీట్ లో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?