అంగరంగ వైభవంగా . *సత్తమ్మ తల్లి....మరిడిమాంబ పండుగ మహోత్సవం* *పసుపు కుంకుమలు సమర్పించుకున్న భక్తులు* .
సింహాచలం.. జూన్ 1.. అప్పన్న సోదరి అడవివరం, శ్రీనివాస్ నగర్ 14 గ్రామాల ప్రజల పొలిమేర దేవతగా విరాజిల్లుతున్న శ్రీ సత్తమ్మ తల్లి.. మరిడి మాంబ అమ్మవారి పండుగ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవం గా నిర్వహించారు. సాంప్రదాయ బద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు. గ్రామ పాలి మేరలో ఉండి ప్రజలును కాపాడే పాలిమేర దేవత గా అమ్మవారు ప్రసిద్ధి గాంచారు.. పండుగ మహోత్సవం భాగముగా తెల్లవారుజామున అమ్మవారిని సుప్రభాత సేవ తో మేలుకొలిపి అందముగా అలంకరించి తదుపరి ఆరాధన గావించారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం నుంచి రాత్రి వరకు భారీగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయం వద్ద
చెక్కర పొంగలి, పులిహార ప్రసాదాలతో పాటు మజ్జిగ,మంచినీరు భక్తులు కు పంపిణీ చేశారు. అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పూలు, విద్యుత్ అలంకరణ లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 93, 98 వార్డు ల కార్పొరేటర్లు రాపర్తి కన్నా. పీవీ నరసింహం. ఇతర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అధ్యక్షులు పి వెంకట్రావు ల ఆధ్వర్యంలో. భక్తులు కు అన్ని సదుపాయాలు కల్పించారు. ఉపాధ్యక్షులు గంట్ల కనకరాజు జాయింట్ సెక్రటరీ బలి రెడ్డి శ్రీనివాస రావు లు భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించారు.
What's Your Reaction?